Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ABN , Publish Date - Mar 26 , 2025 | 08:07 PM
ఆగ్రాలోని ఖేడియా విమానాశ్రయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న ఛార్టెడ్ అత్యవసరంగా విమానం ల్యాండింగ్ చేశారు. మధ్యాహ్నం 3.40 గంటలకు విమానంలో బయలుదేరిన 20 నిమిషాలకే సాంకేతిక లోపం గుర్తించడంతో పెలట్లు వెనక్కి మళ్లించారు.

ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రయాణిస్తున్న ఛార్టెడ్ విమానంలో బుధవారంనాడు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆగ్రాలోని ఖేడియా విమానాశ్రయంలో అత్యవసరంగా విమానం ల్యాండింగ్ చేశారు. మధ్యాహ్నం 3.40 గంటలకు విమానంలో బయలుదేరిన 20 నిమిషాలకే సాంకేతిక లోపం గుర్తించడంతో పైలట్లు వెనక్కి మళ్లించారు.
BJP: సీనియర్ ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ
అనంతరం ఢిల్లీ నుంచి మరో విమానాన్ని రప్పించారు. దీంతో సుమారు గంట సేపు విమానాశ్రయం లాంజ్‌లోనే యోగి వేచిచూశారు. కమిషనర్ ఆఫ్ పోలీస్, జిల్లా మెజిస్ట్రేట్ హుటాహుటిన విమానాశ్రయానికి చేరి పరిస్థితిని సమీక్షించారు. ఢిల్లీ నుంచి విమానం రావడంతో అందులో ముఖ్యమంత్రి లక్నో బయలుదేరి వెళ్లారు.
షెడ్యూల్ ప్రకారం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్టాన్‌లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే, యోగి ప్రయాణిస్తున్న విమానంలో సాకేంతిక లోపం తలెత్తడం, ఆ తర్వాత మరింత జాప్యం జరగడంతో ఆ కార్యక్రమం రద్దయింది.
ఇవి కూడా చదవండి..