Home » Maharashtra
కేకే సర్వే మరోసారి నిజమైంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమిదే అధికారం అని సర్వే సంస్థ స్పష్టం చేసింది. ఆ మేరకు కూటమి లీడ్‌లో కొనసాగుతోంది. మహారాష్ట్రలో మహాయుతికి 225 స్థానాలు వస్తాయని కేకే అంచనా వేశారు. ఊహించినట్టే కూటమి అన్ని స్థానాల్లో లీడ్‌లో ఉంది.
మహారాష్ట్రలో ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మహాయుతి, మహా వికాస్ అఘాడి కూటముల మధ్య ప్రారంభంలో గట్టి పోటీ నెలకొంది. కానీ ప్రస్తుతం మాత్రం లీడ్ స్థానాలు మొత్తం ఒకేవైపు మొగ్గుచూపుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. ప్రధాన పార్టీల కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందనే పలు వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘెల్, డాక్టర్.జి.పరమేశ్వరకు అప్పగించినట్టు ఏఐసీసీ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జార్ఖాండ్ పరిశీలకులుగా తారిఖ్ అన్వర్, మల్లు భట్టి విక్రమార్క, కృష్ణ అల్లవరును నియమించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు ఈ క్యాష్-ఫర్-ఓట్స్ వివాదం చెలరేగింది. పాల్ఘర్ జిల్లాలో బీజేపీ సీనియర్ నేత వినోద్ తావ్డే డబ్బులు పంచారంటూ బహుజన్ వికాష్ ఆఘాడి (బీవీఏ) నేత హితేంద్ర ఠాకూర్ ఆరోపించారు. తావ్డే-బీవీఏ నేతలు-కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న వివాదానికి సంబంధించిన వీడియో కూడా బయటకు రావడంతో సంచలనమైంది.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే సీఎం పదవి కోసం లాబీయింగ్ మొదలైంది. పాను, పర్వత అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలువురు కట్టిన బ్యానర్ల గురించి ఈరోజు చర్చ మొదలైంది. బ్యానర్లలోఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు సీఎం అంటూ విషెస్ తెలియజేశారు.
దేశంలో అధికార, ప్రతిపక్ష కూటములు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ‘మహా’ యుద్థానికి తెరపడింది. మహారాష్ట్రతోపాటు ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
పీ-మార్క్, దైనిక్ భాస్కర్, లోక్షాహి మరాఠీ ముద్ర ఎగ్జిట్ పోల్స్ అటు మహాయుతికి కానీ, ఇటు ఎంవీఏ కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాకపోవచ్చని అంచనా వేశాయి. పీ-మార్క్ మహాయుతికి 137 నుంచి 157 మధ్య, ఎంవీఏకు 126 నుంచి 146 మధ్య సీట్లు రావచ్చని అంచనా వేసింది.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో బీజేపీ..దాని మిత్ర పక్షాలదే హవా అని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలు కాగా, మహారాష్ట్రలో సాయంత్రం 6 గంటలతో, జార్ఖాండ్‌లో సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అప్పటి వరకూ జరిగిన పోలింగ్ శాతం ప్రకారం మహారాష్ట్రలో 58.22 శాతం, జార్ఖాండ్‌లో 67.59 శాతం పోలింగ్ నమోదైంది.