Share News

Maharashta Exit Polls: 'హంగ్' అంచనా వేసిన 3 ఎగ్జిట్ పోల్స్

ABN , Publish Date - Nov 20 , 2024 | 08:38 PM

పీ-మార్క్, దైనిక్ భాస్కర్, లోక్‌షాహి మరాఠీ ముద్ర ఎగ్జిట్ పోల్స్ అటు మహాయుతికి కానీ, ఇటు ఎంవీఏ కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాకపోవచ్చని అంచనా వేశాయి. పీ-మార్క్ మహాయుతికి 137 నుంచి 157 మధ్య, ఎంవీఏకు 126 నుంచి 146 మధ్య సీట్లు రావచ్చని అంచనా వేసింది.

Maharashta Exit Polls: 'హంగ్' అంచనా వేసిన 3 ఎగ్జిట్ పోల్స్

న్యూఢిల్లీ: మహారాష్ట్ర (Maharashtra)లో అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసి ఎగ్జిట్స్ పోల్స్ (Exit Polls) అంచనాలు విడుదలయ్యాయి. అధికార 'మహాయుతి' ప్రభుత్వం మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోనుందంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 288 సీట్ల మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 145 సీట్లు కాగా, విపక్ష మహా వికాస్ అఘాడి వెనుకబడుతుందని అంచనా వేశాయి. అయితే 7 ఎగ్జిట్ పోల్స్‌లో మూడు ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని, 'హంగ్' పరిస్థితి ఉంటుందని అంచనా వేశాయి.

Exit Polls: ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. రెండు రాష్ట్రాల్లో ఎన్డీయేదే హవా


బీజేపీ కూటమిదే విజయమన్న 4 ఎగ్జిట్ పోల్స్

బీజేపీ-శివసేన-ఎన్సీపీతో కూడిన మహాయుతి 150 నుంచి 195 సీట్లతో గెలుపు ఖాయమని 4 ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మాట్రిజ్, చాణక్య స్ట్రాటజీస్, టౌమ్స్ నౌ-జేవీసీ, పీపుల్స్ పల్స్ ఈ అంచనాలు వేశాయి. మాట్రిజ్ 150-170, పీపుల్స్ పల్స్ 175-195, చాణక్య స్ట్రాటజీస్ 152-160, టైమ్స్ నౌ-జేవీసీ 150-160 సీట్లు మహాయుతి కూటమికి వస్తాయని అంచనా వేశాయి. విపక్ష కూటమికి 85 నుంచి 138 వరకూ రావచ్చని పేర్కొన్నారు.


'హంగ్' అంచనాల్లో 3 ఎగ్జిట్ పోల్స్

కాగా, పీ-మార్క్, దైనిక్ భాస్కర్, లోక్‌షాహి మరాఠీ ముద్ర ఎగ్జిట్ పోల్స్ అటు మహాయుతికి కానీ, ఇటు ఎంవీఏ కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాకపోవచ్చని అంచనా వేశాయి. పీ-మార్క్ మహాయుతికి 137 నుంచి 157 మధ్య, ఎంవీఏకు 126 నుంచి 146 మధ్య సీట్లు రావచ్చని అంచనా వేసింది. బీజేపీ కూటమికి 128-142 వరకూ రావచ్చని, ఎంవీఏకు 125-140 రావచ్చని లోక్‌షాహి మరాఠీ ముద్ర అంచనా వేసింది. దైనిక్ భాస్కర్ సైతం మహాయుతికి 125-140, ఎంవీఏకు 135-150 అంచనా వేసింది.


ఇవి కూడా చదవండి...

Assembly Polls: మహారాష్ట్రలో 58.22, జార్ఖాండ్‌లో 67.59 శాతం పోలింగ్

Former Minister: నటుడు విజయ్‌ పార్టీతో పొత్తుకోసం ఇంకా చర్చించలేదు

TVK: టీవీకే పార్టీపై ఇంటెలిజెన్స్‌ నిఘా..

UP Bypolls: ఈసీ కొరడా...ఏడుగురు పోలీసుల సస్పెండ్

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 20 , 2024 | 08:38 PM