Home » Mancherial district
జిల్లాలో ఆదివారం గ్రూప్ 3 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పేపర్ 1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరిగింది. ఉదయం పేపర్ 1కు 15,038 మంది అభ్యర్థులకుగాను 8304 మంది హాజరు కాగా 6734 మంది గైర్హజరయ్యారు.
తాను ఏదైనా మాట ఇస్తే కట్టుబడి పనిచేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు స్పష్టం చేశారు. లక్షెట్టిపేట విశ్రాంతి భవనం ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మితే వారం రోజుల్లో డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం నీల్వాయి, గొర్లపల్లి గ్రామాల్లో ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం వేమనపల్లి ఎంపీడీవో కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను అంద జేశారు.
తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి అన్నారు. ఆదివారం పడ్తన్పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటరు నమోదు ప్రక్రియ ఆశించిన మేర జరగలేదు. ఎలక్షన్ కమిషన్ రెండో విడత ఓటరు నమోదుకు అవకాశం ఇచ్చింది. దీంతో బరిలో నిలచే ఆశావహులు ఓటరు నమోదుపై ఆశలు పెంచుకున్నారు.
జిల్లాలో ఆదివారం గ్రూప్3 పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15,038 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రానికి ముఖ్య పర్యవేక్షకులు, రూట్, జాయింట్ రూట్ అధికారులు, ప్లైయింగ్ స్క్వాడ్లను నియమించారు.
మంచిర్యాల గోదావరి రోడ్డులోని మెడికల్ కాలేజీ ప్రాంగణంలో రూ. 23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు శనివారం శంకుస్ధాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. 50 పడకల సామర్ధ్యం గల ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కేసులకు పరీక్షలు చేస్తారన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం పరిశీలించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 3, 9, 15 వార్డుల్లో జరుగుతున్న సర్వేను తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్వేలో ప్రతీ అంశాన్ని పూరించాలని సిబ్బందికి సూచించారు.
పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గడ్డం వినోద్వెంకటస్వామి అన్నారు. శనివారం దేవాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో 32 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
జిల్లాలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. భక్తులు శుక్రవారం ఉదయం నదీ స్నానాలు ఆచరించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలు, దీపదానాలు చేశారు. గూడెం గుట్టపై నిర్వహించిన మహా జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో నిండింది. పలు ఆలయాలను భక్తులు సందర్శించారు.