Home » Mancherial
వయోవృద్ధు ల సంక్షేమం, పోషణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం సమీ కృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మంది రంలో వయోవృద్ధుల దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
రాష్ట్రస్థాయి కుస్తీ పోటీ లకు అచ్చలాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెం దిన విద్యార్థినులు సీహెచ్ హర్షిత, కె. శ్రీవల్లి, ఈశ్వ రిలు ఎంపికైనట్లు హెచ్ఎం ఉమాదేవి, పీడీ సాం బమూర్తిలు తెలిపారు. ఇటీవల లక్షెట్టిపేటలో నిర్వ హించిన ఉమ్మడి ఆదిలాబాద్ జల్లా జోనల్ స్థాయి కుస్తీ పోటీల్లో అండర్17 విభాగంలో హర్షిత, శ్రీవల్లి, అండర్ 14 విభాగంలో ఈశ్వరిలు ఎంపికయ్యార న్నారు.
శ్రీరాంపూర్‌లోని భగత్‌సింగ్ విద్యామందిర్ పాఠశాలకు చెందిన 1998-99 పదోతరగతి పూర్వ విద్యార్థులు మంగళ వారం సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకున్నారు. తమ బ్యాచ్ పదో తరగతి పూర్తి చేసుకుని 25 ఏళ్లు అయిన సందర్భంగా నస్పూర్ కాలనీ లోని సింగరేణి గార్డెన్స్‌లో వేడుకలు ఏర్పాటు చేశారు.
అటవీ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కింది స్థాయి ఉద్యోగులు మొదలుకుని ఉన్నతాధికారుల వరకు కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో అటవీ సంపదకు రక్షణ కరువైంది. అక్ర మార్కుల గొడ్డలి వేటుకు విలువైన అటవీ సంపద తరిగి పోతుంది. దీంతోపాటు వేటగాళ్లు వన్యప్రాణులను హత మారుస్తున్నారు.
మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని సోమ వారం కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ రావుల ఉప్పలయ్య అధ్యక్షతన నిర్వహించారు. పట్ట ణంలో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
సమస్యలను పరిష్కరించాలని రేషన్ డీలర్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్‌కు అందించారు. రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్తయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గౌరవ వేతనంతోపాటు క్వింటాలు రూ.300 కమీషన్ చెల్లించాలన్నారు.
రైతులు పట్టు పురుగులు సాగు చేయడం ద్వారా లబ్ధి చేకూరుతుందని, అధిక లాభాలు గడించవచ్చని రాష్ట్ర పట్టు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ లత, సెంట్రల్ సిల్క్ బోర్డు సీనియర్ సైంటిస్టు వినోద్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు.
మున్సిపాలిటీల పరిధిలో అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ చట్టం 2019లోని టీఎస్-బీ పాస్‌కు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా లేఅవుట్ పర్మిషన్, భవన నిర్మాణా లకు అనుమతులు, తదితర ప్రక్రియను పటిష్టం చేసేందుకు కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాలను సైతం నియమించింది.
స్ధానిక సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ గ్రామాల ప్రజలు అనారోగ్యం, జ్వరాలతో బాధపడు తున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు.
సమస్యలను పరి ష్కరించడానికే గ్రామాల్లో పర్యటిస్తున్నానని ఎమ్మె ల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం ఇందారంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ కోతలు ఎక్కువగా ఉం టున్నాయని సమస్యను పరిష్కరించాలని ఎమ్మె ల్యేకు తెలిపారు.