Home » Mancherial
పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామి అన్నారు. శనివారం దేవాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో 32 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
జిల్లాలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. భక్తులు శుక్రవారం ఉదయం నదీ స్నానాలు ఆచరించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలు, దీపదానాలు చేశారు. గూడెం గుట్టపై నిర్వహించిన మహా జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో నిండింది. పలు ఆలయాలను భక్తులు సందర్శించారు.
ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి దిశగా ధర్తీ అబ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ మోతిలాల్, నోడల్ అధికారి సీతారాం, డీఎంహెచ్‌వో హరీష్ రాజ్‌లతో కలిసి హాజరయ్యారు.
కేంద్ర ప్రభు త్వం భగవాన్ బీర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి ధర్తీ అబ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన సంచార మెడికల్ యూనిట్‌ను ప్రారంభించామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
ఈనెల28న సింగరేణి డైరెక్టర్‌తో జరిగే స్ట్రక్చర్ సమావేశంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్రఅధ్యక్షుడు వి సీతా రామయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె రాజ్ కుమార్ అన్నారు. నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో వారిద్దరు విలేకరులతో మాట్లా డారు.
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసే కుట్రలకు పాల్పడుతోందని అఖిలపక్షం నాయకులు సంకె రవి, పార్వతి రాజిరెడ్డి, దూలం శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం సీఈఆర్ క్లబ్లో బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
వానా కాలం సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. వరికోతలు ప్రారంభించక ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించా లని భావించినా ఆచరణలో అమలు కావడంలేదు. ఫలితంగా కోతలు పూర్తయి పంట చేతికి వచ్చిన రైతులు ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
గూడెంగుట్టపై కొలువుదీరిన రమాసహిత సత్యనారాయణ ఆలయంలో శుక్రవారం జరిగే కార్తీక పౌర్ణమి మహాజాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పలు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రానున్నారు.
వ్యాపా రులపై కక్షతోనే కూల్చివేతలు చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. గురువారం అర్చనటెక్స్ చౌరస్తా వద్ద నిర్మి స్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఆయ న మాట్లాడుతూ అర్చనటెక్స్ చౌరస్తా నుంచి మార్కెట్ రోడ్డు వెడల్పును మున్సిపల్ అధికా రులు ఎలాంటి టెండర్లు నిర్వహించకుండ చేపట్టారన్నారు.
గురుకుల పాఠశాలల విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మైదానంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కాళేశ్వరం జోన్ 10వ క్రీడా పోటీలు ముగిసాయి. ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.