Home » Mandapeta
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు చర్చంతా చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారు.. అనుభవానికి పెద్దపీట వేస్తారా.. యువతకు అవకాశాలు ఇస్తారా అనే చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఆయా పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేక్‌లు కట్‌చేసి, బాణాసంచా కాల్చి కూటమి విజయాన్ని వేడుకుగా జరుపుకుంటున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు 130కి పైగా స్థానాల్లో విజయం సాధించారు. ఇదే సమయంలో టీడీపీ అనేక రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు ఘన విజయం సాధించారు.
ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థులు పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, నెల్లూరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.
ఏపీ ఓటర్ల తీర్పు వన్‌సైడ్‌గా ఉన్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యం కనబర్చగా.. ఈవీఎంల కౌంటింగ్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మొదటి రౌండ్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో పోలింగ్ ముగిసింది. జనం తమ తీర్పును ఈవీఎంలలో బంధించారు. దీంతో రాజకీయ పార్టీలు, నేతల్లో టెన్షన్ కొనసాగుతుండగా.. ఓటరు మాత్రం కూల్ అయిపోయాడు. తాను ఎలాంటి తీర్పు ఇవ్వాలనుకున్నాడో పోలింగ్ బూత్‌కు వెళ్లి తన తీర్పును రిజర్వు చేసి వచ్చాడు. జూన్4న అసలు తీర్పు వెల్లడికానుంది. ఓటరు ఏ పార్టీని ఆదరించాడనేది మరో 20 రోజుల్లో తెలుస్తుంది. అప్పటివరకు నాయకుల్లో టెన్షన్ కొనసాగనుంది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మెషిన్లలో లాక్ అయింది. జూన్4 ఓట్ల లెక్కింపుతో గెలిచేదెవరో తేలిపోనుంది. పోలింగ్ వేళ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార వైసీపీకి చెందిన నాయకులే ప్రత్యర్థులపై దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతో పోలింగ్ ప్రశాంతంగా జరగకుండా ఉండేందుకు దాడులకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం టీడీపీనే ఘటనలకు కారణమని ఆరోపిస్తోంది.
ఏపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ వ్యూహాలతో పాటు.. అనేక కుట్రలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాగైనా మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా.. ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా.. కూటమి బలం రోజురోజుకు పెరుగుతుండటంతో వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది.
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసులో ప్రత్యేక కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ..
ఏపీలో ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. టీడీపీ, జనసేన బీజేపీ కూటమికి, వైసీపీకి మధ్య నువ్వా, నేనా అన్నట్లు పోటీ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని దశాబ్దానికి పైగా ఒకే పార్టీ గెలుస్తూ వస్తున్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అందులో కోనసీమ జిల్లాలోని మండపేట (Mandapeta) ఒకటి. అంతకుముందు ఆలమూరు నియోజకవర్గంలో భాగంగా ఉన్న మండపేట.. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో మండపేట నియోజక వర్గంగా ఏర్పడింది.