Share News

AP Election Results: భారీ అధిక్యంలో టీడీపీ కూటమి అభ్యర్థులు.. రాజమండ్రి పార్లమెంట్‌లో బీజేపీ లీడ్..

ABN , Publish Date - Jun 04 , 2024 | 09:02 AM

ఏపీ ఓటర్ల తీర్పు వన్‌సైడ్‌గా ఉన్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యం కనబర్చగా.. ఈవీఎంల కౌంటింగ్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మొదటి రౌండ్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

AP Election Results: భారీ అధిక్యంలో టీడీపీ కూటమి అభ్యర్థులు.. రాజమండ్రి పార్లమెంట్‌లో బీజేపీ లీడ్..
TDP

ఏపీ ఓటర్ల తీర్పు వన్‌సైడ్‌గా ఉన్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యం కనబర్చగా.. ఈవీఎంల కౌంటింగ్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మొదటి రౌండ్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాలకు గానూ 10 నియోజకవర్గాలకు పైగా టీడీపీ, జనసేన అభ్యర్థులు అధిక్యాన్ని కనబరుస్తున్నారు.

AP Election Result 2024 Live Updates: టెన్షన్ టెన్షన్.. ఏపీ అసెంబ్లీ కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్.


రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో దగ్గుబాటి పురందేశ్వరి స్వల్ప అధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా చాలా రౌండ్లు లెక్కించాల్సినప్పటికీ మొదట్లో ఉన్న ట్రెండ్ చివరి వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, పిఠాపురం, అమలాపురం, రాజోలు, గన్నవరం, పెద్దాపురం నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు అధిక్యాన్ని కనబరుస్తున్నారు.


Lok Sabha Election Results 2024 Live Updates: దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 04 , 2024 | 09:02 AM