Home » Mangalagiri
గుంటూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి.. అలాగే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసుల విచారణ వేగవంతం కోసం సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం మంగళగిరి డీఎస్పీ సీఐడీకి విచారణ పైళ్లు అప్పగించనున్నారు.
Andhrapradesh: ‘‘ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్లు కూడా బుక్స్ మెయింటెన్ చేయడం మొదలుపెడుతున్నారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు. అదే సమయంలో మేం గుడ్‌బుక్ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం’’ అని జగన్ అన్నారు.
‘క్లీన్ అండ్ గ్రీన్’లో భాగంగా మంగళగిరిలో పరిసరాల పరిశుభ్రతకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వచ్చారు.
ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా అధునాతన డిజైన్ల రూపకల్పనలో చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చి, చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి ఎస్.సవిత తెలిపారు.
జనసేన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఈనెల 22న జనసేనలో చేరుతున్నట్లు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఉదయభాను ప్రకటించారు.
సర్పవరం జంక్షన్/కార్పొరేషన్, సెప్టెంబరు 18: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు బుధవారం మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. వివిధ సమస్యలు ప
గుంటూరు జిల్లా: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను న్యాయస్థానం పోలీసు కస్టడికి అనుమతి ఇచ్చింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి 17వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం మంగళగిరి పోలీసులు రూరల్ స్టేషన్లో విచారించనున్నారు. తెలుగుదేశం ప్రధానకార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారించనున్నారు.
టీడీపీ ఆఫీసుపై(Attack on TDP office) దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను(Nandigam Suresh) పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి కోర్టు(Mangalagiri Court) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఆయనను గురువారం హైదరాబాద్‌లో వెంబడించి మంగళగిరి రూరల్ పోలీసులు పట్టుకున్నారు.