Share News

AP News: టీడీపీ ఆఫీసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత..

ABN , Publish Date - Oct 13 , 2024 | 01:10 PM

గుంటూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి.. అలాగే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసుల విచారణ వేగవంతం కోసం సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం మంగళగిరి డీఎస్పీ సీఐడీకి విచారణ పైళ్లు అప్పగించనున్నారు.

AP News: టీడీపీ  ఆఫీసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత..

గుంటూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ (TDP) ప్రధాన కార్యాలయంపై దాడి.. అలాగే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు (CM Chandrababu) నివాసంపై (House) దాడి (Attack) కేసులను (Cases) ప్రభుత్వం సీఐడీ (CID)కి అప్పగించింది. ఈ కేసుల విచారణ వేగవంతం కోసం సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం మంగళగిరి డీఎస్పీ సీఐడీకి విచారణ పైళ్లు అప్పగించనున్నారు. ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి మంగళగిరి, తాడేపల్లి పీఎస్‌ల పరిధిలో డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. సివిల్ పోలీసుల ద్వారా విచారణ ఆలస్యం అవుతుందనే భావనతో విచారణను వేగవంతం చేసేందుకు సీఐడీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.


టీడీపీ కేంద్రకార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. తర్వాత ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. మరికొందరు నేతలను కూడా విచారణ చేయనున్నారు. అలాగే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు విచారణకు పలుమార్లు పిలిచారు. ఆయన సహకరించలేదు. దీంతో ఈ కేసులను సివిల్ పోలీసుల కంటే సీఐడీకి అప్పగిస్తే త్వరగా విచారణ జరుగుతుందని భావించి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


కాగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్, తలశిల రఘురామ్‌ సహా మరో 14 మంది నిందితులుగా ఉన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని అప్పట్లో వీరంతా ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటమే కాకుండా ఆ ప్రాంతంలో వీరంగం సృష్టించారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందస్తు బెయిల్ కోసం వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. అయితే మొదట ముందస్తు బెయిల్‌కు అంగీకరించేది లేదని హైకోర్టు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగిరమేశ్(Jogi Ramesh), ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో (Sureme Court) విచారణ జరింది. విచారణకు సహకరించాలని జోగిరమేశ్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. అయితే తదుపరి ఉత్తర్వుల ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని సుప్రీం స్పష్టం చేసింది. అలాగే పాస్‌పోర్టు సరెండర్ చేయాలని, దర్యాప్తునకు సహకరించాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తునకు సహకరించపోతే రక్షణ ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Updated Date - Oct 13 , 2024 | 01:20 PM