Home » Manifesto
కేంద్రంలో ప్రతిపక్షం ఇండియన్ నేషనల్ డెలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలియన్స్ (ఇండియా కూటమి) అధికారంలోకి వస్తే... కోటి ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. అలాగే రూ. 500కే సిలండర్ దేశవ్యాప్తంగా అందిస్తామన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో టార్గెట్ 400 చేరుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు గల మార్గాలను అన్వేషిస్తోంది. దేశ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఇప్పటికే సంకల్ప్ సంకల్ప్ పత్ర్ పేరుతో మేనిఫెస్టోను సిద్ధం చేసింది. దీనిని ఈనెల14 తేదీన ..
''మోదీస్ గ్యారెంటీ: డవలప్డ్ ఇండియా 2047'' అనే థీమ్‌తో లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ సిద్ధం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం విడుదల కానుంది.
లోక్‌సభ 2024 ఎన్నికలు(Lok Sabha elections 2024) మరికొన్ని రోజుల్లో మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, RJD నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav)తో పాటు ఇతర పార్టీ నేతలు 'పరివర్తన్ పత్ర' పేరుతో 2024 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను(RJD Manifesto) విడుదల చేశారు.
ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు మేనిఫెస్టో ( Manifesto ) ప్రకటిస్తుంటాయి. తాము అధికారంలోకి వచ్చాక చేపట్టనున్న పనులను ముందుగానే ఓటర్లకు వెల్లడిస్తుంటాయి. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తాయి.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలోని పేదలు మరింత నిరుపేదలయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ కేవలం కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే రుణమాఫీ చేశారు గానీ, రైతులకు రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలోని తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను సీపీఐ విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా శనివారంనాడిక్కడ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను పార్లమెంటు పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చింది.
Congress Jana Jatara: తుక్కుగూడ.. ఇది కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్.! అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక్కడ్నుంచే శంఖారావం మోగించి అఖండ విజయం దక్కించుకుంది. దీంతో ఇప్పుడు ఇదే తుక్కుగూడ నుంచే పార్లమెంట్ ఎన్నికలకు కూడా శంఖారావం మోగించింది కాంగ్రెస్. ఈ భారీ బహిరంగసభకు ‘జనజాతర’ (Jana Jatara) అని నామకరణం చేయడం జరిగింది. తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిండిపోయింది..! ఎక్కడ చూసినా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భారీ కటౌట్లే కనిపిస్తున్నాయి. తెలుగు మేనిఫెస్టోను ఈ సభావేదికగా రాహుల్ రిలీజ్ చేశారు. ఈ సభావేదికగా నిరుద్యోగులు, మహిళలకు కీలక హామీలు ప్రకటించారు. అంతేకాదు.. తెలంగాణతో తనకున్న అనుబంధం.. ఫోన్ ట్యాపింగ్, ఎలక్టోరల్ బాండ్స్ ఈ విషయాలన్నింటిపైనా రాహుల్ అదిరిపోయే ప్రసంగం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. భారతదేశంలో ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ అన్నారు. తాను ప్రారంభించిన ఆయారాం - గయారాం సంస్కృతి పైన ఇప్పటికైనా తన విధానం మార్చుకోవడం మంచిదేనన్నారు.
నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ జరిగింది. జన జాతర సభకు తరలి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సభకు చీఫ్ గెస్ట్‌గా రాహుల్ గాంధీ రానున్నారు. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను రాహుల్ తెలుగులో విడుదల చేయనున్నారు. తెలంగాణకు సంబంధించిన 23 అంశాలను ఏఐసీసీ మేనిఫెస్టోలో చేర్చింది.