Home » Manish Sisodia
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కుదురైంది. మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు కోర్టులో మరో షాక్ తగిలింది. గురువారం ఆయన్ని కోర్టులో హాజరుపరచగా సిసోదియా రిమాండ్ ను నవంబర్ 22వరకు పొడగించాలని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిలు అభ్యర్థనపై తీర్పును సుప్రీంకోర్టు మంగళవారంనాడు రిజర్వ్ చేసింది. సిసోడియో దాఖలు చేసిన రెండు వేర్వేరు బెయిలు పిటిషన్లపై ఇరువర్గాల వాదనలను సుప్రీం ధర్మాసనం వింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)పై సీపీఐ సీనియర్ నేత నారాయణ( CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్ నుంచి నిధుల విడుదలకు అనుమతి కోరుతూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన విజ్ఞప్తికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై సీబీఐ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో శుక్రవారం నిరాశ మిగిలింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ రాష్ట్ర మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లకు నోటీసులు జారీ చేసింది.
మద్యం విధానం రూపకల్పనలో అక్రమాలు, అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) బెయిలు దరఖాస్తుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ జరుపుతామని తెలిపింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారంనాడు సీజ్ చేసింది.