Share News

Delhi liquor scam: మనీష్ సిసోడియా బెయిలు అభ్యర్థనపై సుప్రీం తీర్పు రిజర్వ్..

ABN , First Publish Date - 2023-10-17T17:26:10+05:30 IST

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిలు అభ్యర్థనపై తీర్పును సుప్రీంకోర్టు మంగళవారంనాడు రిజర్వ్ చేసింది. సిసోడియో దాఖలు చేసిన రెండు వేర్వేరు బెయిలు పిటిషన్లపై ఇరువర్గాల వాదనలను సుప్రీం ధర్మాసనం వింది.

Delhi liquor scam: మనీష్ సిసోడియా బెయిలు అభ్యర్థనపై సుప్రీం తీర్పు రిజర్వ్..

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ (Delhi liquor polcy scam) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిలు అభ్యర్థనపై తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారంనాడు రిజర్వ్ చేసింది. సిసోడియో దాఖలు చేసిన రెండు వేర్వేరు బెయిలు పిటిషన్లపై ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింగ్, సీబీఐ-ఈడీ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుల్లో సిసోడియా ఈ ఏడాది ప్రథమార్థంలో అరెస్టయ్యారు. సీబీఐ, ఈడీ ఈ కేసుల్లో విచారణ జరుపుతోంది.


దర్యాప్తు సంస్థలను మందలించిన సుప్రీంకోర్టు

ఎక్సైజ్ పాలసీ కేసుల్లో సిసోడియాను నిరవధింగా జైలులో ఉంచలేరని సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు సోమవారంనాడు మందలించింది. సిసోడియాపై చేసిన ఆరోపణలపై విచారణ కోర్టులో ఆర్గుమెంట్లు ఎప్పుడు మొదలవుతాయని సీబీఐ-ఈడీ తరఫున హాజరైన అడిషనల్ జనరల్ ఎస్‌వీ రాజును ధర్మాసనం ప్రశ్నించింది. ''సిసోడియాను నిరవధికంగా జైలులో ఉంచలేరు. ఇలాగ ఆయనను ఉంచడం కూడా సరికాదు. కేసులో ఛార్జిషీటు ఒకసారి నమోదైన తర్వాత ఆ ఆరోపణలపై వాదోపవాదాలు తక్షణం మొదలవ్వాలి'' అని కోర్టు స్పష్టం చేసింది. ఎప్పటిలోగా ఆర్గుమెంట్లు మొదలవుతాయో మంగళవారంలోగా చెప్పాలని జస్టిస్ ఖన్నా అడిషనల్ సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించారు.

Updated Date - 2023-10-17T17:26:10+05:30 IST