Home » Mayor Vijayalaxmi
జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయం శుక్రవారం ప్రత్యేకంగా కనిపించింది. స్వాగతం పలికేందుకు రెడ్ కార్పెట్, ఆకట్టుకునేందుకు పూలతో అలంకరణ.. వెరసి మొదటి, ఏడవ అంతస్తులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
గాజులరామారంలో ఫీల్డ్ ఆఫీసర్ కిషన్ లీలలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళ పారిశుద్ద్య సిబ్బందిని లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధిత మహిళకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దాంతో బాధితురాలు మీడియా ముందుకు వచ్చి జరిగిన మొత్తం చెప్పింది. మహిళను వేధించిన ఫీల్డ్ ఆఫీసర్‌పై గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆర్థిక సంవత్సరం 2024 -25కి సంబంధించిన బడ్జెట్‌ను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ప్రవేశపెట్టారు. రూ.8,437 కోట్ల వార్షిక బడ్జెట్‌ను జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ఆమె సమర్పించారు. సాధారణ బడ్జెట్ రూ.7937 కోట్లు కాగా డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు ఆమె వివరించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో బడ్జెట్‌పై చర్చ జరిగింది. జీహెచ్ఎంసీ బడ్జెట్ లెక్కలో స్పష్టత కనిపించడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ విమర్శించారు.
Telangana: జీహెచ్ఎంసీ కౌన్సిల్ హల్లో ఓయో రూమ్స్ రగడ చోటు చేసుకుంది. రెసిడెన్సియల్ పేరుతో కమర్షల్ నడిపిస్తున్నారని.. ఫ్యామిలీస్ ఉన్న ప్రాంతాల్లో ఓయో బిజినెస్ చేస్తున్నారని కార్పొరేటర్లు మండిపడ్డారు. రెసిడెంట్స్ పేరుతో, కమర్షల్ బిజినెస్ పేరుతో వ్యాపారం చేస్తుంటే జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
Telangana: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో సమస్యలపై కార్పొరేటర్లు కౌన్సిల్లో ప్రస్తావిస్తూ అధికారులను నిలదీస్తున్నారు. అలాగే ప్రాపర్టీ టాక్స్‌పై కౌన్సిల్లో చర్చ జరిగింది. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ తీసుకుంటున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తెలిపారు.
Telangana: రెండో రోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం హాట్‌హాట్‌గా సాగుతోంది. మంగళవారం ఉదయం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం మొదలైంది. ఈ సందర్భంగా సభలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలను ఏకరువు పెడుతున్నారు. హైదరాబాద్‌లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని.. కుక్కలు కరిసి జనాల ప్రాణాలు పోతున్నాయని.. అయినా పట్టించుకోరా అంటూ అధికారులను కార్పొరేటర్లు నిలదీశారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు మేయర్ వినతి చేశారు.
ప్రపంచంలోని అత్యంత నివాసయోగ్య నగరాల్లో హైదరాబాద్ ఒకటని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) పేర్కొన్నారు.
నగరంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈరోజు(మంగళవారం) ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వర్షాలపై వాతావరణ శాఖ మూడు రోజుల ముందు అలెర్ట్ చేసినా.. జనాలను అలెర్ట్ చెయ్యడంలో జీహెచ్ఎంపీ పూర్తిగా విఫలమైంది. భారీ వర్షానికి కూడా మేయర్ విజయలక్ష్మి క్షేత్రస్థాయిలో పర్యటించని పరిస్థితి. కేవలం టెలికాన్ఫరెన్స్‌లకే మేయర్ పరిమితమవుతున్నారు.
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన, మేయర్ ఆగ్రహంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.