GHMC: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో ఓయో రూమ్స్‌పై రగడ
ABN , Publish Date - Feb 20 , 2024 | 02:15 PM
Telangana: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హల్‌లో ఓయో రూమ్స్ రగడ చోటు చేసుకుంది. రెసిడెన్సియల్ పేరుతో కమర్షల్ నడిపిస్తున్నారని.. ఫ్యామిలీస్ ఉన్న ప్రాంతాల్లో ఓయో బిజినెస్ చేస్తున్నారని కార్పొరేటర్లు మండిపడ్డారు. రెసిడెంట్స్ పేరుతో, కమర్షల్ బిజినెస్ పేరుతో వ్యాపారం చేస్తుంటే జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 20: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హల్‌లో (GHMC Council Meeting) ఓయో రూమ్స్‌పై రగడ చోటు చేసుకుంది. రెసిడెన్సియల్ పేరుతో కమర్షియల్‌గా నడిపిస్తున్నారని, ఫ్యామిలీస్ ఉన్న ప్రాంతాల్లో ఓయో బిజినెస్ చేస్తున్నారని కార్పొరేటర్లు మండిపడ్డారు. రెసిడెంట్స్ పేరుతో వ్యాపారం చేస్తుంటే జీహెచ్‌ఎంసీ (GHMC) పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. ఓయో రూమ్స్ నిబంధనలపై క్రాస్ చెక్ చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.
టౌన్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌పై...
అలాగే.. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ అక్రమాలకు అడ్డాగా మారిందని కాంగ్రెస్ కార్పొరేటర్లు (Congress Corporators) వ్యాఖ్యలు చేశారు. అధికారులు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారన్నారు. అధికారులకు ఫోన్ చేస్తే కనీసం రెస్పాండ్ కావడం లేదని మండిపడ్డారు. కార్పొరేటర్లు కేవలం డబ్బుల కోసమే ఫోన్ చెయ్యరని - ప్రజా ప్రజల పరిష్కారం కోసం తాము ఉన్నామని చెప్పుకొచ్చారు. టౌన్ ప్లానింగ్ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ కార్పొరేటర్లు స్పష్టం చేశారు.
ఇవి చదవండి
GHMC Commissioner: టాక్స్ వసూళ్లలో సమస్యలున్నాయి.. పరిష్కారం వెతుకుతున్నాం..
GHMC: ప్రాపర్టీ టాక్స్‌పై కౌన్సిల్‌లో చర్చ.. అధికారులను నిలదీసిన కార్పొరేటర్లు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..