Home » Medak
జిల్లాలో విషాదం నెలకొంది. పెళ్లి బృందం పైకి కారు దూసుకెళ్లింది. చేగుంట మండలం రెడ్డిపల్లి వడ్డెర కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు , మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. భూతగాదాల నేపథ్యంలో కక్షతో అదే గ్రామానికి చెందిన వ్యక్తి కారుతో ఢీ కొట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
Telangana: కొమురవెళ్లి మల్లికార్జున స్వామివారి మూలవిరట్ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ ఈవో బాలాజీ శర్మ తెలిపారు. ఉత్సవ విగ్రహాలతో భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు.
Telangana: జిల్లాలోని చేర్యాల పట్టణంలో కల్తీపాల కలకలం రేగింది. చేర్యాలలోని ప్రభుత్వ అనుబంధ సంస్థ విజయ డెయిరిలో పాలను కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. పాలల్లో వెన్నశాతం ఎక్కువ రావడానికి ఉప్పు, చక్కెర వేసి కల్తీ చేసి అమ్ముతున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మెదక్ జిల్లా: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రసిద్ధ మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజాము 4 గంటలకు మొదటి ఆరాధనతో బిషప్ కే. పద్మారావు వేడుకలను ప్రారంభించారు.
Telangana: జిల్లాలోని చిన్నకొడూర్ మండలం రాముని పట్లలో దారుణం చోటు చేసుకుంది. కలెక్టర్ గన్‌మెన్ నరేష్.. తన భార్య, ఇద్దరు పిల్లలను గన్‌తో కాల్చి చంపేశాడు. ఆపై నరేష్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. గౌరవెళ్లి, దేవాదుల పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగుకు నీళ్లిస్తామన్నారు. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతుందని తెలిపారు.
Telangana: రాష్ట్రమంతా కొంత ఇబ్బంది ఉన్నా సంగారెడ్డిలో మాత్రం ఈ సారి గులాబీ జెండా ఎగిరిందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బ తిన్నా ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా కష్టపడి పని చేశారన్నారు.
Telangana: జిల్లాలోని తూప్రాన్ శివారులో గల టాటా కాఫీ పరిశ్రమ సమీపంలో శిక్షణ విమానం కూలింది. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానం పూర్తిగా దగ్ధమైంది.
Telangana Results: ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 నియోజకవర్గాలో బీఆర్ఎస్ 6 స్థానాల్లో, కాంగ్రెస్ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, జహీరాబాద్, సంగారెడ్డి, పఠాన్ చెరు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
Telangana: జిల్లాలోని పుల్కల్లో విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.