• Home » Medaram Jatara

Medaram Jatara

Medaram: మేడారంలో తిరుగువారం పండగ నేడు

Medaram: మేడారంలో తిరుగువారం పండగ నేడు

ములుగు జిల్లా: సమ్మక్క-సారలమ్మ పూజారులు బుధవారం తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. దీంతో మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు. ఆదివాసి పూజారులు పూజా మందిరాలను శుద్దిచేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పూజా మందిరాలకు తాళాలు వేస్తారు.

Medaram Jathara: నేడు మేడారం నుంచి హుండీల తరలింపు

Medaram Jathara: నేడు మేడారం నుంచి హుండీల తరలింపు

నేడు మేడారం నుంచి హుండీలను హన్మకొండకు తరలించనున్నారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించి అక్కడ హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు లెక్కించనున్నారు. 29 నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం కానుంది. మేడారం మహాజాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు.

Medaram Jatara: ఘనంగా ముగిసిన మేడారం మహాజాతర.. జనం నుంచి వనంలోకి సమ్మక్క..

Medaram Jatara: ఘనంగా ముగిసిన మేడారం మహాజాతర.. జనం నుంచి వనంలోకి సమ్మక్క..

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా సాగి అత్యంత వైభవంగా ముగిసింది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వన ప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది.

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు త్వరలోనే శుభవార్త: సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు త్వరలోనే శుభవార్త: సీఎం రేవంత్

ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండ‌ర్, తెల్ల‌రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి పేద‌వానికి 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించ‌నున్న‌ట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్య‌క్రమాలు ప్రారంభానికి ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌రవుతార‌ని ఆయన వెల్ల‌డించారు. ఇక రైతుల‌కు ఇచ్చిన రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై బ్యాంకుల‌తో చ‌ర్చిస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే రైతుల‌కు మంచి శుభ‌వార్త చెప్ప‌బోతున్నామ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

CM Revanth: మేడారం మహాజాతరపై కేంద్రానికి ఎందుకింత వివక్ష

CM Revanth: మేడారం మహాజాతరపై కేంద్రానికి ఎందుకింత వివక్ష

మేడారం మహాజాతర(Medaram Jatara)పై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. మంత్రి సీతక్క కృషితో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర పండుగగా మేడారం జాతరను ప్రకటించారని గుర్తుచేశారు. కుంభమేళాను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించినప్పుడు.. సమ్మక్క- సారలమ్మ జాతరను గుర్తిస్తే తప్పెంటీ అని నిలదీశారు. దక్షిణాది కుంభమేళాకు ప్రాముఖ్యం ఇచ్చినప్పుడు.. మేడారం జాతరను కేంద్రం ఎందుకు విస్మరిస్తుందని ప్రశ్నించారు.

Medaram Jatara: మేడారంకు గవర్నర్ తమిళిసై.. నిలువెత్తు బంగారం సమర్పణ..

Medaram Jatara: మేడారంకు గవర్నర్ తమిళిసై.. నిలువెత్తు బంగారం సమర్పణ..

Telangana: మేడారం సమక్క - సారమ్మ మహా జాతర వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే పెద్దసంఖ్యలో భక్తులు మేడారంకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్, కేంద్రమంత్రి నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.

Medaram Jatara: మేడారం జాతరలో పోలీసుల అత్యుత్సాహం.. డ్యూటీలు వదిలి మరీ..

Medaram Jatara: మేడారం జాతరలో పోలీసుల అత్యుత్సాహం.. డ్యూటీలు వదిలి మరీ..

Telangana: మేడారం మహాజాతరలో పోలీసుల ఓవరాక్షన్‌ పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతరలో విధులు నిర్వహిస్తున్న డ్యూటీ పోలీసులు వారి కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. డ్యూటీలో ఉన్న పోలీసులు ప్రధాన గద్దెలపైకి వారి కుటుంబాలను పంపిస్తున్నారు.

Medaram Jatara: వనం వీడి జనంలోకి సమ్మక్క.. మరి కాసేపట్లో గద్దెలపైకి..

Medaram Jatara: వనం వీడి జనంలోకి సమ్మక్క.. మరి కాసేపట్లో గద్దెలపైకి..

సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో మేడారం మహా జాతర (Medaram Maha Jatara) వైభవంగా జరుగుతోంది. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారాలను భక్తులు సమర్పిస్తున్నారు. అయితే జాతరలో రెండో రోజు జాతరలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభమైంది. వనం వీడి జనం మధ్యలోకి సమ్మక్క బయలుదేరింది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలుకల గుట్ట సమీపంలోకి చేరుకుంది.

Medaram Jatara: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల ఆగ్రహం

Medaram Jatara: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల ఆగ్రహం

Telangana: మేడారం జాతరను జాతీయ హోదా పండుగగా గుర్తించలేమంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏబీఎన్‌ -ఆంధ్రజ్యోతితో బీఆర్‌ఎస్ నేత సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... బీజేపీకి గిరిజనులపై ప్రేమలేదన్నారు. బీజేపీ కపటప్రేమ బయటపడిందని మండిపడ్డారు.

Seethakka: తల్లులకు ఘనస్వాగతం పలుతాం... ఘనంగా సాగనంపుతాం

Seethakka: తల్లులకు ఘనస్వాగతం పలుతాం... ఘనంగా సాగనంపుతాం

Telangana: మేడారం సమక్క - సారలమ్మ మహా జాతర కీలక ఘట్టానికి చేరిందని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కోయ పూజారులు ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి చిలకలగుట్టలో పూజలు ప్రారంభమవుతాయన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి