Seethakka: తల్లులకు ఘనస్వాగతం పలుతాం... ఘనంగా సాగనంపుతాం
ABN , Publish Date - Feb 22 , 2024 | 01:30 PM
Telangana: మేడారం సమక్క - సారలమ్మ మహా జాతర కీలక ఘట్టానికి చేరిందని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కోయ పూజారులు ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి చిలకలగుట్టలో పూజలు ప్రారంభమవుతాయన్నారు.
మేడారం, ఫిబ్రవరి 22: మేడారం సమక్క - సారలమ్మ మహా జాతర (Medaram Maha Jatara) కీలక ఘట్టానికి చేరిందని మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కోయ పూజారులు ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి చిలకలగుట్టలో పూజలు ప్రారంభమవుతాయన్నారు. సమ్మక్క వచ్చే ముందు జిల్లా ఎస్పీ శబరీష్ రెండు రౌండ్లు కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలుకుతారన్నారు. కంకవణాల మధ్య ఉండే సమ్మక్కకు ఆమె వచ్చే ముందు నీడ ఏర్పాటు కోసం కంకవణం స్థాపన చేస్తామని తెలిపారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటున్నామన్నారు. తల్లులకు ఘనస్వాగతం పలుతామని... ఘనంగా సాగనంపుతామని మంత్రి సీతక్క వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...