Home » Medchal
మద్యం మత్తులో ఇంటిల్లిపాదిని తిడుతూ నిత్యం నానాయాగి చేస్తున్న అన్నను అతని తమ్ముళ్లే చంపేశారు. కత్తులతో వెంబడించి విచక్షణారహితంగా పొడిచి నడిరోడ్డుపైనే అతని ప్రాణం తీశారు.
ఫీజు ఎప్పుడు కడతారు? అంటూ తనను ప్రిన్సిపల్, స్కూల్లో అందరి ముందు నిల్చోబెట్టి అడగడాన్ని ఆ బాలిక తీవ్ర అవమానకరంగా భావించింది. బడికి వెళ్లలేక కొన్నిరోజులుగా ఇంట్లోనే ఉంటున్న ఆ విద్యార్థిని ఆ మనోవేదనతోనే తన గదిలో ఆత్మహత్య చేసుకుంది.
మేడ్చల్ మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(Medchal Munirabad Outer Ring Road) కల్వర్టు కింద ఈనెల 24న జరిగిన మహిళ హత్యకేసు మిస్టరీ వీడింది. గుర్తుతెలియని మహిళ హత్యగా నమోదైన కేసును మేడ్చల్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
Telangana: గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్‌లో వీడియోల ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే హాస్టల్ వార్డెన్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరోవైపు పలు ఫింగర్ ప్రింట్‌లను కూడా పోలీసులు సేకరించారు. ఫింగర్ ప్రింట్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
మేడ్చల్ సీఎంఆర్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినిలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్ బాత్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినిలు ఆందోళన బాట పట్టారు.
తెలంగాణ: బహదూర్‌పూర్ ప్రాంతానికి చెందిన డీసీఎం డ్రైవర్ మహమ్మద్ ఉమర్ కురేషిపై గో రక్షక్ దల్ సభ్యులు దాడి చేయడం గందరగోళ పరిస్థితులకు తెరలేపింది. డీసీఎం వాహనంలో ఆవులు తరలిస్తున్నట్లు గుర్తించిన గో రక్షక్ దల్ సభ్యులు మేడ్చల్ వద్ద అతడిని అడ్డగించి దాడి చేశారు.
చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కొరడా ఝుళిపిస్తోంది. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఈ సంస్థ..మళ్లీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని సీసీఐ గోదాములో సంభవించిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.52 కోట్ల విలువ చేసే పత్తి కాలి బూడిదయ్యింది. అగ్నిమాపక దళం తొమ్మిది గంటల పాటు కష్టపడినా ఫలితం లేకండాపోయింది.
రూ.50 కోట్ల విలువ చేసే సర్కారు స్థలానికి కొందరు ఎసరు పెట్టారు. అడిగే వారు లేరన్న ధీమాతో ప్రభుత్వ భూమిలో దర్జాగా ఇళ్లు, షెడ్లు, పశువుల కొట్టాలు ఏర్పాటు చేసుకున్నారు.
నగర రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చేసిన మెట్రోరైళ్లు.. మాకూ కావాలంటూ ఆయా ప్రాంతాల్లో డిమాండ్లు అధికమవుతున్నాయి. ట్రాఫిక్ చిక్కులను తప్పించి వేగంగా గమ్యం చేరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. అధునాతన రవాణా వ్యవస్థ ద్వారా తమ పరిసరాలు మరింత వృద్ధి చెందుతాయని ఆయా ప్రాంతాల వారు ఆశిస్తున్నారు.