Share News

Medchal: గో రక్షక్ దల్ సభ్యులు దాడి.. ఆస్పత్రి పాలైన డ్రైవర్.. విషయం ఇదే..

ABN , Publish Date - Jan 02 , 2025 | 10:38 AM

తెలంగాణ: బహదూర్‌పూర్ ప్రాంతానికి చెందిన డీసీఎం డ్రైవర్ మహమ్మద్ ఉమర్ కురేషిపై గో రక్షక్ దల్ సభ్యులు దాడి చేయడం గందరగోళ పరిస్థితులకు తెరలేపింది. డీసీఎం వాహనంలో ఆవులు తరలిస్తున్నట్లు గుర్తించిన గో రక్షక్ దల్ సభ్యులు మేడ్చల్ వద్ద అతడిని అడ్డగించి దాడి చేశారు.

Medchal: గో రక్షక్ దల్ సభ్యులు దాడి.. ఆస్పత్రి పాలైన డ్రైవర్.. విషయం ఇదే..

మేడ్చల్: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ (Ghatkesar Police Station) పరిధిలో గో రక్షక్ దల్ (Go Rakshak Dal) సభ్యులు ఓ డ్రైవర్‌పై దాడి చేయడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘట్కేసర్ టౌన్ బైపాస్ రోడ్డులో డీసీఎం వాహనంలో ఆవులను తరలిస్తున్నట్లు గో రక్షక్ దల్ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వెంటనే బయలుదేరిన వారు వాహనాన్ని నిలిపివేసే ప్రయత్నం చేశారు. అయితే బహదూర్‌పూర్ ప్రాంతానికి చెందిన డీసీఎం డ్రైవర్ మహమ్మద్ ఉమర్ కురేషి (Mohammad Umar Qureshi) ఆపకుండా వెళ్లిపోయాడు.


డ్రైవర్ కురేషి వెంటపడిన గో రక్షక్ దల్ సభ్యులు చివరికి డీసీఎం వాహనాన్ని అడ్డగించారు. అనంతరం డ్రైవర్‌పై తీవ్రంగా దాడి చేశారు. దాడిలో కురేషి తీవ్రంగా గాయపడగా.. స్థానికులు అతన్ని ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దాడి ఘటన సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.


అయితే డ్రైవర్ కురేషిపై దాడి చేయడంతో ఎమ్మెల్సీ రహమత్ బేగ్, ఎంఐఎం కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. బీజేపీ నేతలు ఏనుగు సుదర్శన్ రెడ్డి సహా ఇతర కార్యకర్తలు, నాయకులు సైతం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పరిస్థితిని సమీక్షించేందుకు ఏసీపీలు చక్రపాణి, శ్రీకాంత్ గౌడ్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఇరువర్గాలతో మాట్లాడే ప్రయత్నం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad Metro: మేడ్చల్‌.. శామీర్‌పేటకు మెట్రో!

Hyderabad: కుళ్లిపోయిన టమాటాలు, బొద్దింకలు

Updated Date - Jan 02 , 2025 | 10:43 AM