Home » MIM
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పోలింగ్‌కు మరో 17రోజుల సమయం మాత్రమే ఉంది. ఎక్కువ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 17లోక్‌సభ స్థానాలు ఉన్నప్పటికీ.. అందరి గురి కేవలం 16 స్థానాలే.. ఈ నియోజకవర్గాల్లోనే గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు పోటీపడుతుంటారు. మరో నియోజకవర్గం గురించి అసలు ప్రస్తావనే ఉండదు.. ఎందుకంటే ఎన్నికలకు ముందే అక్కడి ఫలితం ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు. అదే హైదరాబాద్ నియోజకవర్గం. ఓవైసీ కుటుంబానికి 35 ఏళ్ల నుంచి ఈ నియోజకవర్గం అడ్డాగా మారింది.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. నేటితో ఆ ప్రక్రియ ముగియనుంది. దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతోపాటు ఓటర్లకు డబ్బులు పంచేందుకు తగిన వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు.
పార్లమెంట్ పరిధిలోని ప్రజలను పూర్తిస్థాయిలో కలిసేలా అభ్యర్థులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంటింటి ప్రచారం ఏ ప్రాంతాల్లో చేయాలి, వాకర్లు, కాలనీ, బస్తీ సంఘాలతో సమావేశాలు ఎప్పుడు నిర్వహంచాలి, అగ్రనేతలతో రోడ్ షోలు, క్షేత్రస్థాయి ప్రచారం ఎక్కడ చేయాలి అన్న దానిపై ముఖ్యనేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు.
Telangana: ‘‘కొంతమంది మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారు.. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్ ఇచ్చి.. మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోంది’’ అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాకుండా హెచ్చరికలు కూడా చేశారు.
కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి మొండి ఘటం అని, పోరాడి అధికారం సాధించుకున్నారని అసదుద్దీన్ అభిప్రాయ పడ్డారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అంటోన్న సంగతి తెలిసిందే. అసదుద్దీన్ ఒవైసీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో ఉంటుందని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్దిష్ట సమాజానికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రధానిపై ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ ( BRS ) తరపున MIM నేతలు ఎందుకు ఒకాలత్ తీసుకుంటున్నారని... వారు ఎవరి తరఫున ఉండాలో నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ...శ్రీశైలం విద్యుత్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముందే సమాచారం అధికారులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి( YSR ) వైఖరి వల్లే మజ్లిస్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయిందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) తెలిపారు. శనివారం నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... ఇప్పుడున్న ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలి. పోటీ పరీక్షలను ఉర్దూ మీడియంలో కూడా నిర్వహించాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ( BJP Party ) తరఫున 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈ ఎమ్మెల్యేలంతా రేపు (శనివారం) జరిగే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) ఉంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Raja Singh ) ప్రకటించారు.