Hyderabad: ఔర్ ఏక్ బార్ అసద్..! హైదరాబాద్‌లో విజయదుందుభి
ABN , Publish Date - Jun 05 , 2024 | 11:03 AM
హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై పతంగి మరోసారి ఎగిరింది. వరుసగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi).. ఔర్ ఏక్ బార్ అంటూ ఐదోసారి కూడా విజయఢంకా మోగించారు. మొత్తం 10,47,659 ఓట్లు పోలయ్యాయి.
- మరింత బలంగా ఎంఐఎం
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై పతంగి మరోసారి ఎగిరింది. వరుసగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi).. ఔర్ ఏక్ బార్ అంటూ ఐదోసారి కూడా విజయఢంకా మోగించారు. మొత్తం 10,47,659 ఓట్లు పోలయ్యాయి. ఇందులో అసదుద్దీన్‌కు 6,61,981 ఓట్లు రాగా.. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మాధవీలత(BJP candidate Madhavilatha)కు 3,23,894 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత విశ్రాంతి లేకుండా మజ్లిస్ ఎంపీ, ఎమ్మెల్యేలు బస్తీల్లో తిరిగి ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలు చేశారు. అంతేగాకుండా బీజేపీపై విమర్శలు చేస్తూ తాము ఆ పార్టీకి బీ టీమ్ కాదని చెప్పుకున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: హమ్మయ్య.. ప్రశాంతంగానే ముగిసిందిగా...
ఈ క్రమంలో నాడు దూరమైన ఓటు బ్యాంక్ కాస్తా దగ్గరైంది. దీంతోపాటు యాకుత్‌పురాలో మజ్లిస్ ను ఓటమికి చేరువలో తీసుకెళ్లిన ఎంబీటీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల నుంచి తప్పించుకోవడం కూడా మజ్లిస్ పార్టీకి బాగా కలిసొచ్చింది. బీజేపీ వ్యూహం కొంతవరకు ఫలించినా... మైనార్టీ వర్గం నుంచి ఓట్లు రాబట్టేందుకు ఆమె ప్రయత్నాలు చేయలేదనే విమర్శలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన ప్రజలు ఎంపీ ఎన్నికల్లో మజ్లిస్, బీజేపీ వైపు మొగ్గు చూపారు. కాగా, మాధవీలతకు గోషామహల్ నియోజకవర్గంలో మాత్రమే మజ్లిస్ కంటే 61,518 ఓట్ల మెజార్టీ వచ్చింది.
ఎన్‌డీఏ, బీజేపీయేతర ప్రభుత్వానికి మద్దతు
కేంద్రంలో ఎన్‌డీఏ, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే తాము మద్దతు ఇస్తామని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాలేదన్నారు. నిరుద్యోగులు, రైతులు, దళితులు బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ఓటు వేశారని పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News