Home » Mohan Babu University
తిరుపతిలో మోహన్‌బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కాలేజీకి వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది కాలేజీ గేట్లు మూసివేసి ఎవరినీ లోపలకు రాకుండా కట్టుదిట్టం చేశారు. మీడియాను కూడా అక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది హుకుం జారీ చేసింది. మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు.. భద్రతా కట్టుదిట్టం చేశారు.
మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఘర్షణ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఆస్తుల పంపకం విషయంలో మోహన్ బాబు ఆగ్రహించారని, ఈ మేరకు ఆయన అనుచరులు వినయ్, బౌన్సర్లు కలిసి మనోజ్, ఆయన భార్య మౌనికపై దాడి చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి.