Home » Money Scam
బ్రిటానియా, అమెజాన్ సహా పలు కంపెనీల పేరు చెప్పి ఓ సంస్థ అనేక మందిని చీట్ చేసింది. ఆ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఓ సంస్థ దాదాపు రూ. 1700 కోట్లు దోచేసింది. పోంజీ స్కాం పేరుతో లూటీ చేసిన ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
Money Scam Case: కాల్‌మనీ రాక్షసులు మళ్లీ రెచ్చిపోతున్నారు. వారు చేస్తున్న అరాచకాలతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. తీసుకున్న అప్పుకు లక్షలకు లక్షలు వడ్డీలు కట్టినా వేధిస్తోండటంతో బాధితులు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Call Money Case: ఏపీలో కాల్‌మనీ మళ్లీ పడగ విప్పుతోంది. కాల్‌మనీ రాక్షసుల ధన దాహానికి చాలా మంది ప్రజలు బలవుతున్నారు. వేలల్లో తీసుకున్న అప్పుకు లక్షలు చెల్లించినా వడ్డీ వ్యాపారుల వేధింపులు ఆగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మరోసారి కాల్‌మనీ దందా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) కంపెనీ అంటూ నమ్మించారు. అనేక స్కీమలు పెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని అమాయక ప్రజల నుంచి సుమారు రూ.200 కోట్లు వసూలు చేశారు.
వైసీపీ నాయకుడి గ్రావెల్ దందా వాస్తవమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు నివేదికను పంపారు. వైసీపీ నాయకుడు బొంబాయి రమే్‌షనాయుడు ప్రభుత్వ, మాన్యం భూముల్లో గ్రావెల్‌ను అక్రమంగా తవ్వుకున్నారని టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, లక్ష్మీనారాయణ, ఆదినారాయణ నవంబరు 11న కలెక్టరేట్ గ్రీవెన్సలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి నివేదిక ...
ఎవరో వీడియో కాల్ చేసి.. ఏదో దర్యాప్తు సంస్థ పేరు చెప్పి.. కేసులున్నాయని బెదిరిస్తే స్థిమితంగా ఆలోచించాల్సిపోయి ఉన్నత విద్యావంతులూ హడలిపోతున్నారు.
ఆ ఊళ్లో ఐదేళ్ల నుంచి తాగునీటి సమస్యలేదు. రక్షిత మంచినీటి పథకం నుంచి కావాల్సినంత నీరు అందుతోంది. 2019లో తాగునీటి ఎద్దడి ఏర్పడటంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ట్యాంకర్లతో నీటిని అందించింది. ఆ తరువాత వాటర్ ట్యాంకర్ల అవసరమే పడలేదు. కానీ ట్యాంకర్లతో నీరు తెచ్చి గ్రామస్థుల దాహార్తిని తీర్చినట్లు నకిలీ రికార్డులను సృష్టించి సుమారు రూ.16 లక్షలు మింగేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాల కోసం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఇదే ..
‘‘మేము ముంబై పోలీసులం. మీ పేరు మనీ ల్యాండరింగ్ కేసులో ఉంది. మీరు ఈ కేసు నుంచి బయటపడాలంటే మేము చెప్పినంత డబ్బును చెప్పిన అకౌంట్‌కు పంపాలి’’ అని బెదిరిస్తూ.. డబ్బులు కాజేస్తున్న నిందితుడిని గోదావరిఖని సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
‘‘కేసును విచారించే కోర్టు మారినా.. విషయం మారదు కదా?’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం పైవిధంగా స్పందించింది.
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, రోజూ ఇలాంటి కథనాలు పత్రికలు, టీవీల్లో వస్తున్నా మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తాజాగా మచిలీపట్నంలో అలాంటి మోసమే వెలుగు చూసింది. కొంత నగదు కడితే అధిక మెుత్తంలో తిరిగి చెల్లిస్తామని చెప్పి వాట్సాప్ గ్రూపుల ద్వారా కేటుగాళ్లు ప్రజల్ని బురిడీ కొట్టించారు.