Share News

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..

ABN , Publish Date - Feb 18 , 2025 | 04:33 PM

బ్రిటానియా, అమెజాన్ సహా పలు కంపెనీల పేరు చెప్పి ఓ సంస్థ అనేక మందిని చీట్ చేసింది. ఆ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఓ సంస్థ దాదాపు రూ. 1700 కోట్లు దోచేసింది. పోంజీ స్కాం పేరుతో లూటీ చేసిన ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Ponzi Scam

దేశంలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. పోంజీ (Ponzi Scam) పేరుతో తక్కువ సమయంలో పెట్టుబడులు చేయడం ద్వారా ఎక్కువ మొత్తాలను పొందవచ్చని అనేక మందిని మభ్యపెట్టారు. ఈ క్రమంలో ఓ సంస్థ వేలాది మందిని చీట్ చేసి దాదాపు రూ. 1,700 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ కేసు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ అనే సంస్థ అమెజాన్, బ్రిటానియా వంటి ప్రముఖ కంపెనీలతో డిపాజిటర్లతో సంబంధం ఉందని చెప్పి, 22% వరకు రాబడి ఇస్తామని హామీ ఇచ్చారు.


సగం మాత్రమే..

ఈ నేపథ్యంలో 2021 నుంచి ఫాల్కన్ సంస్థ దాదాపు 7,000 మంది పెట్టుబడిదారుల నుంచి రూ. 1,700 కోట్లు (సుమారు $196 మిలియన్లు) వసూలు చేసింది. ఈ మొత్తం నుంచి కేవలం సగం మాత్రమే తిరిగి వసూలు చేసినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకా దాదాపు 100 మిలియన్ డాలర్లు తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు అధికారులు. ఈ సంస్థ అధిక రాబడి ఇస్తామని అనేక మందికి హామీ ఇచ్చి మోసగించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులతోపాటు బాధితులు కూడా మీడియాకు తెలియజేశారు. ఈ కేసు విషయంలో పోలీసులు శనివారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.


సోషల్ మీడియా ద్వారా..

న్యూఢిల్లీకి చెందిన ఆభరణాల వ్యాపారి అంకిత్ బిహానీ గత వారం 50 మంది పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. ఆ క్రమంలో వారు కోల్పోయిన రూ. 500 కోట్లు తిరిగి పొందడానికి చట్టపరమైన పరిష్కారాల గురించి చర్చించారు. వారిలో ఎక్కువ మంది సోషల్ మీడియా ద్వారా పెట్టుబడి గురించి తెలుసుకుని అందులో మనీ పెట్టినట్లు బిహానీ తెలిపారు. తాను కష్టపడి సంపాదించిన డబ్బు, ఇప్పుడు ఎలా తిరిగి పొందాలో అర్థం కావడం లేదని 15 మిలియన్లు కోల్పోయిన టెక్ ఉద్యోగి రూపేష్ చౌహాన్ అన్నారు. ఇలా అనేక మంది వారి సంపదను కోల్పోయారు.


అవగాహన లేకుండా..

ఇటీవల సోషల్ మీడియా గ్రూపుల్లో నకిలీ పెట్టుబడి పథకాల పేరుతో ప్రజలను మోసం చేసే ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇది కూడా అలాంటిదే అని చెప్పవచ్చు. అయితే వీటిలో మోసపోతున్న వారిలో అనేక మంది విద్యావంతులే ఉండటం విశేషం. ఈ మోసాలకు ప్రధాన కారణం పలు రకాల యాప్స్, వెబ్‌సైట్‌లు, కాల్ సెంటర్‌లు కారణమవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో మోసపూరిత పథకాలపై అవగాహన లేకుండా పెట్టుబడులు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఫాల్కన్ సంస్థ కొత్త పెట్టుబడుల నుంచి వచ్చిన డబ్బును పాత పెట్టుబడులకు ఉపయోగించింది. మిగిలిన నిధులను వివిధ షెల్ సంస్థలకు మళ్లించిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఫాల్కన్ వ్యవస్థాపకుడు, ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ముందు 5 రికార్డులు.. బ్రేక్ చేస్తాడా..

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..


New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..

BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 18 , 2025 | 04:37 PM