Home » Moscow
రష్యాలో భారత ప్రధానమత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా మాస్కోలోని అణుకేంద్రాన్ని ఆ దేశాధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ తో కలిసి మోదీ మంగళవారంనాడు సందర్శించారు.
యావత్ ప్రపంచాన్ని హడలెత్తించిన మాస్కో ఉగ్రదాడిలో (Moscow Terror Attack) తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ‘టెలిగ్రామ్’ (Telegram) అనే మెసేజింగ్ యాప్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. కేవలం డబ్బుల కోసమే తాము ఈ పనికి పాల్పడినట్లు.. ముష్కరుల్లో ఓ వ్యక్తి పేర్కొన్నాడు. తమను ఆ మెసేజింగ్ యాప్ ద్వారా సంప్రదించారని.. తమకు డబ్బులు, ఆయుధాలు సరఫరా చేసిందెవరో తెలియదని అతడు పేర్కొన్నాడు.
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ ఖండించింది. 133 మందిని బలిగొన్న మారణకాండను తీవ్రంగా పరిగణించింది. రష్యా ( Russia ) ప్రజలకు, ప్రభుత్వానికి భారతదేశం బాసటగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
రష్యా (Russia) రాజధాని మాస్కోలో (Moscow) భీకర ఉగ్రదాడి (Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లోకి ముష్కరులు దూసుకొచ్చి కాల్పులు జరపడంతో.. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్.. ముఖ్యంగా ISIS-K అని పిలువబడే బ్రాంచ్ ప్రకటించింది.
రష్యా (Russia) రాజధాని నగరం మాస్కోపై అనేక డ్రోన్లతో దాడి జరిగింది. అయితే నష్టం స్వల్పమేనని, ఎవరూ తీవ్ర స్థాయిలో గాయపడలేదని నగర మేయర్ సెర్గీ సొబ్యనిన్ ఓ ప్రకటనలో తెలిపారు.