Share News

Moscow Attack: మాస్కో ఉగ్రదాడిలో దిమ్మతిరిగే ట్విస్ట్.. మొత్తం ఆ యాప్ నుంచే..

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:01 PM

యావత్ ప్రపంచాన్ని హడలెత్తించిన మాస్కో ఉగ్రదాడిలో (Moscow Terror Attack) తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ‘టెలిగ్రామ్’ (Telegram) అనే మెసేజింగ్ యాప్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. కేవలం డబ్బుల కోసమే తాము ఈ పనికి పాల్పడినట్లు.. ముష్కరుల్లో ఓ వ్యక్తి పేర్కొన్నాడు. తమను ఆ మెసేజింగ్ యాప్ ద్వారా సంప్రదించారని.. తమకు డబ్బులు, ఆయుధాలు సరఫరా చేసిందెవరో తెలియదని అతడు పేర్కొన్నాడు.

Moscow Attack: మాస్కో ఉగ్రదాడిలో దిమ్మతిరిగే ట్విస్ట్.. మొత్తం ఆ యాప్ నుంచే..

యావత్ ప్రపంచాన్ని హడలెత్తించిన మాస్కో ఉగ్రదాడిలో (Moscow Terror Attack) తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ‘టెలిగ్రామ్’ (Telegram) అనే మెసేజింగ్ యాప్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. కేవలం డబ్బుల కోసమే తాము ఈ పనికి పాల్పడినట్లు.. ముష్కరుల్లో ఓ వ్యక్తి పేర్కొన్నాడు. తమను ఆ మెసేజింగ్ యాప్ ద్వారా సంప్రదించారని.. తమకు డబ్బులు, ఆయుధాలు సరఫరా చేసిందెవరో తెలియదని అతడు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను జాతీయ టీవీ ఛానెళ్లు ప్రసారం చేశాయి.


ఈ ఉగ్రదాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రష్యా దళాలు (Russian Troups).. నలుగురు నిందితుల్ని ‘ఖట్సన్’ అనే గ్రామం వద్ద అరెస్ట్ చేశాయి. వారిలో ఓ వ్యక్తిని ఈ దాడి గురించిన వివరాలు అడగ్గా.. డబ్బుల కోసమే తాను ప్రజలపై కాల్పులు జరిపానని స్పష్టం చేశాడు. తనకు 5 లక్షల రూబుళ్లను ఆఫర్‌ చేశారని అతడు చెప్పగా.. అందులో సగం మొత్తం అతని బ్యాంక్ ఖాతాలో వేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడి వెనుక ఎవరున్నారని ప్రశ్నించగా.. ఆ విషయం తమకు తెలియదని, టెలిగ్రామ్ యాప్ ద్వారా వాళ్లు సంప్రదించారని చెప్పాడు. డబ్బులు, ఆయుధాలు సరఫరా చేసిన వాళ్లెవరో తెనకు తెలియదని వెల్లడించాడు. ఈ దాడి జరిపాక తమ ఆయుధాల్ని రోడ్డుపక్కన పారేశామని మరో దుండగుడు చెప్పాడు. ఆ నిందితులపై రష్యా దళాలు దాడులు చేసే దృశ్యాలు కూడా బయటకొచ్చాయి.

ఇదిలావుండగా.. రష్యా (Russia) రాజధాని మాస్కోలోని క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాలులోకి నలుగురు ముష్కరులు దూసుకొచ్చి, ప్రజలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇప్పటివరకూ 133 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ముష్కరులు తజికిస్థాన్‌కు చెందిన వారని రష్యా అధికారులు స్పష్టం చేశారు. ఈ దాడికి ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ (ISIS-K) బాధ్యత వహించింది. అయితే.. రష్యా మాత్రం ఉక్రేనియన్ లింక్‌ని అనుసరిస్తున్నట్లు సూచనలు ఉన్నాయి. కానీ.. ఉక్రెయిన్ అధికారులు ఈ దాడితో తమకెలాంటి సంబంధం లేదని గట్టిగా బదులిచ్చారు. అటు.. ఈ దాడి వెనుకున్న వారిని గుర్తించి తప్పకుండా శిక్షిస్తామని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ప్రతిజ్ఞ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 03:01 PM