Home » Mumbai Indians
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ పెద్ద షాకిచ్చింది. అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అంతేకాదు.. రూ.30 లక్షల భారీ జరిమానా కూడా..
ఐపీఎల్-2024లో (IPL 2024) తమ చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగారు. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లక్నో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరోసారి చెలరేగాడు.
ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం సాయంత్రం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది.
ఐపీఎల్ 2024 (IPL 2024)లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్(MI) జట్టు ప్లేఆఫ్ రేసులో లేదు. కానీ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నేటి మ్యాచ్‌కు ముందు తన పాత స్నేహితుడిని కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో KKR జట్టు సహాయ కోచ్ అభిషేక్ నాయర్(Abhishek Nayar)తో రోహిత్ శర్మ మాట్లాడటం కనిపిస్తోంది.
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్న ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తూ, హార్దిక్ పాండ్యా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిల్లీర్స్ విమర్శించాడు. ధోనీని అనుకరిద్దామనుకుంటున్నాడని, ముంబై టీమ్‌కు అలాంటి కెప్టెన్సీ పని చేయదని డివిల్లీర్స్ అన్నాడు.
ముంబై ఇండియన్స్ జట్టుని రోహిత్ శర్మ వీడనున్నాడా? తదుపరి ఐపీఎల్ సీజన్లో అతను మరో ఫ్రాంచైజీకి జంప్ కానున్నాడా? అంటే.. అవుననే అభిప్రాయాలే క్రీడా వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఐపీఎల్ సీజన్ హార్దిక్ పాండ్యాకు ఏమాత్రం కలిసిరాలేదు. అసలు రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతడిని నియమించినప్పటి నుంచే విమర్శలు వస్తున్నాయి. ఐదు ఐపీఎల్ టైటిల్స్‌ని..
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. ముంబై బౌలర్లు వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి.. ఈసారి పవర్‌హిట్టర్స్ చేతులెత్తేయాల్సి వచ్చింది.
ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.
ఈరోజు ఐపీఎల్ 2024(IPL 2024)లో 55వ మ్యాచ్ ముంబై ఇండియన్స్(Mumbai Indians), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. అయితే ముంబై ఇండియన్స్ దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. కానీ నేటి మ్యాచులో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ SRHపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.