IPL 2024: రోహిత్, హర్ధిక్‌కు నీతా అంబానీ సందేశం.. ఏంటంటే..?
ABN , Publish Date - May 21 , 2024 | 09:49 PM
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో పది ఓడింది. కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. టీమ్ గెలవకపోవడానికి ప్రధాన కారణం కెప్టెన్సీ మార్పు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో పది ఓడింది. కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. టీమ్ గెలవకపోవడానికి ప్రధాన కారణం కెప్టెన్సీ మార్పు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొందరు విశ్లేషకులు ఆ అభిప్రాయంతో అంగీకరిస్తారు. రోహిత్, హర్ధిక్ మధ్య సమన్వయం లోపం కూడా స్పష్టంగా కనిపించింది.
నీతా అంబానీ సందేశం
ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో లీగ్ దశలో వెనుదిరిగింది. దాంతో ముంబై జట్టు యజమాని నీతా అంబానీ స్పందించారు. అసలు ఏం జరిగిందో సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. అందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు.
‘ఈ సీజన్ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆశించిన విధంగా జట్టు రాణించలేదు. అయినప్పటికీ తాను ముంబై ఇండియన్స్ అభిమానిస్తాను. ఓ యజమానిగా చెప్పడం లేదు. ఓ ఫ్యాన్‌గా చెబుతున్నా. ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించడం గొప్ప గౌరవం, ప్రత్యేకతగా భావిస్తున్నా. ఈ సీజన్‌లో జరిగిన ఆటపై తప్పకుండా సమీక్ష చేయాలి. అదేవిధంగా టీ 20 వరల్డ్ కప్ ఆడే రోహిత్ శర్మ, హర్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, బుమ్రాకు ఆల్ ద బెస్ట్ అని’ నీతా అంబానీ సందేశం ఇచ్చారు.