Home » Nadendla Manohar
Andhrapradesh: టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రయాణం ముమ్మాటికీ రాష్ట్రం.. ప్రజలకోసమే అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 17న ఇరుపార్టీలు చిలకలూరిపేటలో నిర్వహించబోయే ఉమ్మడి బహిరంగసభ నిజంగా చరిత్ర సృష్టిస్తుందన్నారు. టీడీపీ - జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు జరిగే మేలు ఏమిటో ఆ సభలోనే పవన్ కల్యాణ్ ప్రకటిస్తారన్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏపీయూడబ్ల్యూజే బృందం సోమవారం భేటీ అయ్యింది. జర్నలిస్టుల సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టాలని వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నేతలు కోరారు. టీడీపీ హయాంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పెట్టిన పలు పథకాలను జగన్ రద్దు చేశారని చంద్రబాబుకు జర్నలిస్తులు వివరించారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదని నేతలు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రశ్నించారు. సోమవారం తెనాలిలో పర్యటించారు.
డయేరియా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar ) అన్నారు. శనివారం జీజీహెచ్‌లో డయేరియాతో బాధపడుతున్న వారిని మనోహర్ పరామర్శించారు.
వైసీపీ సలహాదారుల వల్ల వేలకోట్ల ప్రజాధనం వృథా అవుతుందని... వారి వల్ల ఎవరికి ప్రయోజనమని జనసేన అధినేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ప్రశ్నించారు. సీఎం సలహాదారుల పేరుతో 680 కోట్లు ఖర్చు చేశారంటూ నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనంలోకి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వస్తున్నారని.. కార్యాచరణ సిద్ధం చేశామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) తెలిపారు.
Andhrapradesh: మనబడి నాడు - నేడులో భారీగా అవినీతి చోటు చేసుకుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 6321 కోట్ల రూపాయలు నాడు నేడుకు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందన్నారు.
అమరావతి: విశాఖలో జనసేన నేతల అరెస్టులపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడిన జనసేన నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు మిగిలిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులను అడ్డుపెట్టుకుని జనసేన పార్టీపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) అన్నారు. జనసేన నాయకుల అరెస్టును ఖండిస్తూ శనివారం నాడు త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు నాదెండ్ల మనోహర్ వెళ్లారు.
Andhrapradesh: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రెండో వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నివాళులర్పించారు.