Share News

TDP-Janasena:: టీడీపీ - జనసేన ఉమ్మడి ప్రయాణం ముమ్మాటికి అందుకోసమే

ABN , Publish Date - Mar 07 , 2024 | 01:41 PM

Andhrapradesh: టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రయాణం ముమ్మాటికీ రాష్ట్రం.. ప్రజలకోసమే అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 17న ఇరుపార్టీలు చిలకలూరిపేటలో నిర్వహించబోయే ఉమ్మడి బహిరంగసభ నిజంగా చరిత్ర సృష్టిస్తుందన్నారు. టీడీపీ - జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు జరిగే మేలు ఏమిటో ఆ సభలోనే పవన్ కల్యాణ్ ప్రకటిస్తారన్నారు.

TDP-Janasena:: టీడీపీ - జనసేన ఉమ్మడి ప్రయాణం ముమ్మాటికి అందుకోసమే

అమరావతి, మార్చి 7: టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రయాణం ముమ్మాటికీ రాష్ట్రం.. ప్రజలకోసమే అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Janasena PAC Chairman Nadendla Manohar) స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 17న ఇరుపార్టీలు చిలకలూరిపేటలో నిర్వహించబోయే ఉమ్మడి బహిరంగసభ నిజంగా చరిత్ర సృష్టిస్తుందన్నారు. టీడీపీ - జనసేన ప్రభుత్వం (TDP - Janasena) ఏర్పడ్డాక ప్రజలకు జరిగే మేలు ఏమిటో ఆ సభలోనే పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ప్రకటిస్తారన్నారు. జనసైనికులు, వీరమహిళలు ఏ విధంగా సభను విజయవంతం చేయాలో ఆలోచించుకొని, ఎవరికివారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ప్రతి గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చేలా జనసైనికులు పట్టుదలగా పని చేయాలన్నారు.

MLC Jeevan Reddy: రేవంత్ మొగోడు.. ఎంత మంది ఒక్కటైనా ఏం చేయలేరు



జనసేన కార్యాలయం గోడలు దూకి మరీ పోలీసులు అర్థరాత్రి లోపలికి ప్రవేశించడం సిగ్గుచేటని మండిపడ్డారు. జనసేన కార్యాలయంలో ఉన్న అపార్ట్ మెంట్లోకి చొరబడి, అక్కడున్న భద్రతా సిబ్బంది, పార్టీ మీడియా విభాగం సిబ్బందిని ఆయుధాలతో బెదిరించారని తెలిపారు. కార్యాలయంలో ఉన్న ఒక కంప్యూటర్‌ను, అక్కడున్న ఇతర సమాచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారన్నారు. మీడియా వచ్చేలోపే పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు వినియోగిస్తున్న ముఖ్యమంత్రి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీతో పవన్ కల్యాణ్ జరిపే పొత్తు చర్చలు సానుకూలంగానే ముగుస్తాయని, మూడుపార్టీల మధ్య కొత్త స్నేహం చిగురిస్తుందని విశ్వసిస్తున్నామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

DK Aruna: నన్ను విమర్శిస్తే ఆకాశంలో ఉమ్మినట్టే.. రేవంత్‌పై డీకే అరుణ ఫైర్

Kadiyam Srihari: ఎన్నికలప్పుడు పార్టీలు మారడం సహజమే..


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 07 , 2024 | 01:50 PM