Home » Nirmala Sitharaman
లోక్ సభ ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో శ్వేత పత్రం ప్రవేశ పెడతామని స్పష్టంచేసింది. యూపీఏ హయాంలో ఆర్థిక వనరుల దుర్వినియోగం జరిగిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు.
'పన్నుల వాటా, రాష్ట్రాల మధ్య పంపిణీ' అనే అంశంపై పార్లమెంటులో సోమవారంనాడు చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. బీజేపీయేతర ప్రభుత్వాల పట్ల 'వివక్ష' చూపుతున్నారంటూ అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ఇందులో వాస్తవం లేదని నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. లోక్ సభ ఎన్నికల ముందు వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 బడ్జెట్‌ని ఆమె గురువారం ఉదయం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికంటే ముందు..
గురువారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. ‘ఐమెక్’ (IMEC) ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. రాబోయే వందేళ్లలో ఈ ప్రాజెక్ట్ ప్రపంచ వాణిజ్యానికి ఆధారం కానుందని, భారత్‌తో పాటు యావత్ ప్రపంచానికే ఇది గేమ్‌చేంజర్‌గా మారుతుందని పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (01/02/24) మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో.. తమకు తప్పకుండా ప్రయోజనాలు ఉంటాయని, ఆర్థిక మంత్రి భారీ ప్రకటనలు చేస్తారని అన్ని రంగాల వాళ్లు అభిప్రాయపడ్డారు. ఆశించినట్టుగానే కొందరికి ప్రయోజనాలు చేకూరేలా నిర్మలా సీతారామన్ ప్రకటనలిచ్చారు.
త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను వర్గాలకు ఊరట కల్పించేలా నిర్ణయం తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ.. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ గతేడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానాన్నే ఈసారి కూడా కొనసాగించారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో మధ్యతరగతి జీవులకు ఏమైనా ఉపశమనం ఉంటుందేమో.. ఆదాయ పన్నులకు సంబంధించిన ఉపశమన ప్రకటనలు ఏమైనా ఉంటాయేమోనని అంతా భావించారు. మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ కేంద్రం సాహసోపేతంగా ఏవైనా ప్రకటనలు చేస్తుందేమోనన్న చిన్న అనుమానాలు కలిగాయి. కానీ అవన్నీ పటాపంచలయ్యాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 'ప్రగతి శీలక బడ్జెట్'గా అభివర్ణించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ఈ బడ్జెట్ ఒక గ్యారెంటీ ఇచ్చిందన్నారు.
ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని, వారి ఆశలపై నీళ్లు చల్లిందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించిందని ఆరోపించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ 2024-25ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆర్థిక సంవత్సరం 2025 మొత్తం వ్యయం రూ. 47.66 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు. రుణేతర ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు ఉండొచ్చని, నికర రుణాలు రూ. 11.75 లక్షల కోట్లుగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది.