Home » Nitish Kumar
ఎన్నికల ప్రచార ఉధృతితో ఆరితేరిన నేతలు కూడా ఒక్కోసారి తడబడుతుంటారు. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారంనాడు పాట్నాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సరిగ్గే ఇలాగే తడబడ్డారు. నరేంద్ర మోదీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని పార్టీల దృష్టి యూపీ, బీహార్‌పైనే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు సాధించడం కోసం ఎన్డీయే, ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నాయి. యూపీతో పోలిస్తే బీహార్ రెండు కూటములకు కీలకంగా మారింది.
బిహార్ రాజధాని పట్నా(Patna)లోని పున్పున్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident)జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా.. పలువురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా నడిబొడ్డున ఉన్న హోటల్లో గురువారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా హోటల్ మొత్తం వ్యాపించి, అన్ని ఫ్లోర్లకు విస్తరించాయి.
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏడు విడతల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్ ఈనెల 26వ తేదీన జరగనుంది. బీహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానానికి రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. బీహార్‌లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి అభ్యర్థుల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఒక పూర్నియా స్థానంలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పప్పు యాదవ్ పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అసలు నితీశ్‌కు అంత దుస్థితి ఏమొచ్చిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు పోటీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నామినేషన్ పత్రాలను మంగళవారంనాడు ఆయన దాఖలు చేశారు. ఎన్డీయేకు చెందిన పలువురు సీనియర్ నేతలు నితీష్ వెంట ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రధాని మోదీ(PM Modi) బిహార్ పర్యటన ముగిసింది. ఆయన శనివారం ఒక్క రోజే రూ.34,800 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఔరంగాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో సీఎం నితీశ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఎన్డీయేలోకి ఇటీవల తిరిగి వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శనివారంనాడు ఒకే వేదక పంచుకున్నారు. ప్రధాని సైతం తనకు సమర్పించిన దండను నితీష్‌తో షేర్ చేసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ నుంచి నేరుగా ప్రధాని మోదీ బీహార్ వెళతారు. అక్కడ రూ.34, 800 కోట్లతో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. బీహార్‌లో ఇటీవల జేడీయూ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి మోదీ బీహార్‌లో పర్యటిస్తున్నారు.
బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగింది. 11 సీట్లకు జరగాల్సిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ శుక్రవారంనాడు ప్రకటించింది. వీటిలో నితీష్ కుమార్ సీటు కూడా ఉండటం విశేషం.