Khelo India Youth Games 2025: ఖేలో ఇండియా యూత్ గేమ్స్.. ఆటకు రాజకీయాలకు గట్టి లింక్
ABN , Publish Date - Apr 14 , 2025 | 05:16 PM
Bihar Assembly Elections: రాజకీయాలకు క్రీడలకు విడదీయరాని అనుబంధం ఉంది. చాలా మంది స్పోర్ట్ స్టార్ట్స్ పాలిటిక్స్‌లోకి వచ్చి మంచి సక్సెస్ అయ్యారు. అయితే రాజకీయల కోసం క్రీడల్ని వాడుకోవడం, పొత్తులపై స్పష్టత ఇచ్చేందుకు పాలిటిక్స్‌ను యూజ్ చేయడం మాత్రం ఎక్కడా చూసుండరు. ఇది బిహార్‌లో చోటుచేసుకుంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

సినీ తారలు, క్రీడా ప్రముఖులకు పబ్లిక్‌లో గ్లామర్, క్రేజ్ ఎక్కువ. ఈ పాపులారిటీని వాడుకొని మూవీస్, స్పోర్ట్స్ నుంచి పాలిటిక్స్‌కు షిఫ్ట్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వాళ్లలో కొంతమంది మంచి సక్సెస్ అయ్యారు కూడా. అయితే ఫిల్మ్స్, స్పోర్ట్స్‌ను ఛరిష్మా కోసం బాగా వాడుకోవడం రాజకీయాల్లో కామనే. కానీ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌ను కూడా పాలిటిక్స్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఆఖర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొత్తులపై క్లారిటీ ఇచ్చేందుకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2025ను వినియోగించుకున్నారు నితీష్. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..
క్లారిటీ వచ్చేసినట్లే..
నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) ఈసారి ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేయనుందని, ఎన్‌డీఏ నుంచి ఆ పార్టీ వైదొలగడం ఖాయమని కొన్నాళ్లుగా రూమర్స్ వస్తున్నాయి. బీజేపీ పెద్దలు కూడా నితీష్‌ను పట్టించుకోవడం లేదని.. రాబోయే ఎలక్షన్స్‌లో కమలం పార్టీ కూడా ఒంటరిగా వెళ్లాలని పట్టుదలతో ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో జనతాదళ్-బీజేపీ పొత్తుపై ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చారు నితీష్. త్వరలో ఖేలో ఇండియా యూత్స్ గేమ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మే 4న పాట్నాలో ఈ టోర్నమెంట్ లోగో, మస్కట్ శుభాంకర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని నితీష్ తెలిపారు.
రూమర్స్‌కు చెక్
పేరుకే క్రీడల గురించి మాట్లాడినా.. నితీష్ ప్రకటన పొత్తు గురించేనని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. బీజేపీతో తమ బంధం బలంగా ఉందని, ప్రధాని మోదీతో భుజం భుజం కలిపి నడుస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారని చెబుతున్నారు. పొత్తులపై రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు మోదీ ప్రస్తావన తీసుకొచ్చారని.. జనతాదళ్-బీజేపీ సంయుక్తంగా పోటీచేస్తే తిరిగి కూటమి సర్కారు అధికారంలోకి రావడం ఖాయమని ఎక్స్‌పర్ట్స్ జోస్యం చెబుతున్నారు. నితీష్‌ది మామూలు బుర్ర కాదు.. గేమ్స్‌ను రాజకీయాల కోసం భలే వాడుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మే 4 నుంచి మే 15 వరకు బిహార్‌లోని పాట్నా, గయా, నలంద, భాగల్పూర్, బెగుసరాయ్‌లో ఖేలో ఇండియా గేమ్స్ జరగనున్నాయి. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 8,500 మంది అథ్లెట్లు, 1500 మంది టెక్నికల్ స్టాఫ్ పాల్గొననున్నారు.
ఇవీ చదవండి:
ఐపీఎల్ కెప్టెన్స్‌కు బీసీసీఐ షాక్
ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్లకు తప్పిన ప్రమాదం
నా ఇన్నింగ్స్‌కు విలువ లేదు: నాయర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి