Home » Nitish Kumar
బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మిత్రపక్షాన్ని వీడి ఎన్డీఏలో చేరిన నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. గతాన్ని విస్మరించి సరికొత్తగా ముందుకు వెళ్దామని ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైదొలగి, ఎన్డీఏలో చేరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Bihar Political crisis: బీహార్ అసెంబ్లీ బలపరీక్షలో నితీష్ కుమార్ నెగ్గారు. నితీష్ కుమార్‌కు మద్దతుగా 129 మంది శాసనసభ్యులు ఓటు వేశారు. అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా.. మ్యాజిక్ ఫిగర్ 122 సీట్స్ కావాలి. అయితే, నితీష్ వర్గం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
బీహార్‌లో నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైంది. సోమవారం బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యారు. తొలుత గవర్నర్ ప్రసంగం అనంతరం ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవథ్ బిహారీ చౌదరి పై అధికార పక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు వ్యతిరేకంగా 112 ఓట్లు పడటంతో స్పీకర్‌ను తొలగించారు.
బిహార్ అసెంబ్లీలో సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ప్రభుత్వం సోమవారం బలపరీక్షకు వెళ్లనున్న విషయం విదితమే. మహాఘట్ బంధన్ నుంచి బయటకి వచ్చాక బీజేపీతో జట్టుకట్టి నితీశ్ 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
బీహర్‌లో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీలో సోమవారం నాడు నితీశ్ కుమార్ బలం నిరూపించుకోవాల్సి ఉంది.
బిహార్ సీఎం నితీశ్ కుమార్ త్వరలో అసెంబ్లీలో బల పరీక్షకు వెళ్తున్న వేళ.. ఆర్జేడీ(RJD)కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కనిపించకకుండా పోవడం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. నితీశ్(Nitish Kumar) మహాఘట్బంధన్ను వీడి బీజేపీ(BJP)లో చేరిన అనంతరం మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ "ఆట ముగియలేదు" అని కామెంట్స్ చేశారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల యూటర్న్ తీసుకొని మాజీ మిత్రపక్షమైన ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను అక్కడికి ఇక్కడికి వెళ్లనని, శాశ్వతంగా ఎన్డీఏతోనే ఉంటానని స్పష్టం చేశారు.
బీహార్‌కు తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ తన మంత్రివర్గానికి శనివారంనాడు శాఖలు కేటాయించారు. హోం శాఖను సీఎం తన వద్దనే ఉంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి ఆర్థిక, ఆరోగ్యం, క్రీడా శాఖలు అప్పగించారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హాకు వ్యవసాయ శాఖ కేటాయించారు.
జీవితాంతం ఎన్డీఏ(NDA)లోనే కొనసాగుతానని బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) అన్నారు. బీజేపీ(BJP)తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత నితీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.