Share News

Bihar: ఇక శాశ్వతంగా ఎన్డీఏతోనే.. నితీశ్ కుమార్ సంచలన ప్రకటన..

ABN , Publish Date - Feb 09 , 2024 | 12:16 PM

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల యూటర్న్ తీసుకొని మాజీ మిత్రపక్షమైన ఎన్‌డీఏలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను అక్కడికి ఇక్కడికి వెళ్లనని, శాశ్వతంగా ఎన్డీఏతోనే ఉంటానని స్పష్టం చేశారు.

Bihar: ఇక శాశ్వతంగా ఎన్డీఏతోనే.. నితీశ్ కుమార్ సంచలన ప్రకటన..

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల యూటర్న్ తీసుకొని మాజీ మిత్రపక్షమైన ఎన్‌డీఏలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను అక్కడికి ఇక్కడికి వెళ్లనని, శాశ్వతంగా ఎన్డీఏతోనే ఉంటానని స్పష్టం చేశారు. నిన్న ( గురువారం ) దిల్లీలో ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. 2005 నుంచి బిహార్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని అన్నారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చర్చలో అన్ని విషయాలు చర్చించుకున్నామని తెలిపారు. కాగా.. నితీశ్ కుమార్ ఎన్డీఏలోకి తిరిగి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీని కలిశారు.

బిహార్‌లో ఎన్డీఏ కూటమితో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం. కేంద్రం, రాష్ట్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకుంటుందని పూర్తి నమ్మకంగా ఉన్నాను.

- నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి


కాగా.. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి జేడీయూ వైదొలిగింది. గవర్నర్‌ను కలిసి నితీశ్ కుమార్ తన రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో జేడీయూ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జనతా దళ్ తిరిగి ఎన్డీయే గూటికి చేరడాన్ని ఇండియా కూటమికి షాక్‌గా చెప్పవచ్చు. బిహార్ లో అత్యధిక కాలం సీఎం పదవిని చేపట్టిన నేతగా నితీశ్ కుమార్ గుర్తింపు పొందారు. దాదాపు 20 ఏళ్లుగా ఆయన బిహార్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 09 , 2024 | 12:16 PM