Home » Notice
తమ సంస్థ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ముర్షిదాబాద్‌లోని భారత్ సేవాశ్రమ్ సంఘ్‌కు చెందిన స్వామి ప్రదీప్తానంద మహరాజ్ పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి......
తెలంగాణ విద్యుత్ సంస్థలపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోమని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు హెచ్చరించారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు విద్యుత్ సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తూ సంస్థల ప్రతిష్ఠను మరింత దిగజారుస్తున్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు ఏ.శంకర్, సంయుక్త కార్యదర్శి డి.కోటేశ్వరరావు, జాతీయ ఓబీసీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు, రిటైర్డ్ సీజీఎం ఆళ్ల రామకృష్ణ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని పెద్దలు, రిటైర్డ్ అధికారులను సీఎండీలు, డైరెక్టర్లుగా నియమించి సంస్థను నిలువు దోపిడీ చేశారన్నారు. పదోన్నతులు, పోస్టింగుల్లో పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడ్డారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వందల కోట్లు కూడబెట్టారని ఆరోపించారు.
జార్ఘాండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు పట్టుబడటంతో మంత్రి అలంగీర్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఈనెల 14న తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆయనను కోరింది.
బాలీవుడ్ నటి కరీనాకపూర్ చిక్కుల్లో పడ్డారు. తన ప్రెగ్నసీకి చెందిన అనుభవాలతో రాసిన 'ప్రెగ్నన్సీ బైబిల్' అనే పుస్తకం ఈ చిక్కుల్ని తెచ్చిపెట్టింది. బుక్ టైటిల్లో 'బైబిల్' అనే పదం వాదటం తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందంటూ న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోని పిటిషన్ వేశారు. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా కరీనాకపూర్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసు పంపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఢిల్లీ పోలీసులు (Delhi police) రెండు రోజుల క్రితం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) డీప్ ఫేక్ వీడియో (Deep fake Video) కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ చేశారు. మే 1వ తేదీన హాజరుకావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
కదిరి, ఏప్రిల్ 26 : మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌కు న్యాయవాదిగా వ్యవహరిస్తూ వైసీపీ అభ్యర్థి మక్బుల్‌బాషా తరఫున నామినేషన్ల పరిశీలనకు వచ్చిన ప్రసాద్‌రెడ్డిపై టీడీపీ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ తరఫు న్యాయవాది కే. ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు.
బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిని కించపరచేలా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాకు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు పంపింది. ఈనెల 11వ తేదీ సాయంత్ర 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.
మహిళలను కించపరచే విధంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ను ఎలక్షన్ కమిషన్ సోమవారంనాడు మందలించింది. వారికి షోకాజ్ నోటీసులు పంపింది.
రూ.1823 కోట్లు చెల్లించాలంటూ ఆదాయం పన్ను విభాగం నుంచి నోటీసు రావడంతో కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోంది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, ప్రభుత్వం మారిన తర్వాత తాము తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయం పన్ను అంశంలో ఆ పార్టీకి ఆదాయం పన్ను విభాగం శుక్రవారం నోటీసులు పంపింది. 2017-18, 2021-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1,823 కోట్ల మేర పన్ను నోటీసులు ఇచ్చింది.