Home » NRI
గల్ఫ్ ఏడారిలో మగ్గిపోతున్నానని, తన ప్రాణాలను రక్షించాలంటూ నిన్న (గురువారం) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సెల్ఫ్ వీడియో ద్వారా వేడుకున్న నిర్మల్ జిల్లాకు చెందిన రాథోడ్ నామ్‌దేవ్ (గురువారం) జాడను గుర్తిస్తున్నట్టు తెలుస్తోంది.
అమెరికాలో తానా సాంస్కృతిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర అమెరికాలో తెలుగు అసోసియేషన్ (తానా) ఆధ్వర్యంలో ఏటా తెలుగువారి కోసం, తెలుగువారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సంస్థ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలుగువారి ఐక్యతను చాటేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎడారి దేశంలో కన్న తండ్రి కన్నుమూస్తే కడసారి చూడడానికి ఆ దేశంలో ఉన్న కొడుకు చూడలేని పరిస్థితి. భుజాల మీద మోసి, పెద్ద చేసిన తండ్రికి కడసారి వీడ్కోలు పలుకలేపోయాడు. ఎలాగోలా ధైర్యం చేసి వచ్చేసిన ఆ కుమారుడికి నిరాశే మిగిలింది. 900 కిలో మీటర్ల దూరం వచ్చేసరికి కన్న తండ్రి మృతదేహం మాతృదేశానికి వెళ్ళిందని తెలిసి కన్నీరు మున్నీరయ్యాడు.
ఉపాధి కోసం అరబ్ దేశానికి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళకు సాయం అందింది. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం తుర్కపల్లె గ్రామానికి చెందిన షేక్ హసీనా అనే యువతి గల్ఫ్ దేశంలో సాయం కోసం చూసింది. తనను రక్షించాలని మంత్రి నారా లోకేశ్‌కు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. లోకేష్ పిలుపు మేరకు సౌదీ అరేబియాలో ఏపీ ఎన్ఆర్ఐ ప్రతినిధి స్పందించారు.
జీవితానికి బాటలు వేసిన బడికి పూర్వ విద్యార్థులు తోచిన సాయం అందించడం చూస్తూనే ఉంటాం. వారిని చూసి స్ఫూర్తిపొంది మరికొందరు సాయం చేయడానికి ముందుకు రావడం సహజమే.
కెనడా దేశంలో నోవా మల్టీఫెస్ట్ -2024 వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హాలిఫాక్స్ డార్ట్మౌత్ నగరంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఘనంగా ప్రదర్శించారు. ముఖ్యంగా భారతీయ నృత్యాలు, యుద్ధ కళలు, సంగీతాన్ని విదేశీయులకు రుచి చూపించారు. కెనడా వాసులు సైతం మన సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆగస్టు 4న ఆదివారం మెగా వైద్యశిబిరం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో 650కి పైగా మందికి ఉచిత వైద్యసేవలు అందించారు.
ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వివాదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్(Israel)లోని భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం భద్రతా సలహాను జారీ చేసింది. భారతీయ పౌరులందరూ(indian people) అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని తెలిపింది.
తానా న్యూ ఇంగ్లాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో హాప్కిన్టన్ బోస్టన్‌లో ఫాదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో..
నవత, యువత, భవిత... అనే నినాదంతో తెలుగు వారి అతి పెద్ద పండుగ ఆటా-2024 వేడుక అమెరికాలో ఘనంగా జరిగింది. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో జూన్ 7 నుంచి9 వరకు అట్లాంటాలో జరిగిన 18వ ఆటా కన్వెన్షన్‌కు 18 వేల మందికి పైగా హాజరయ్యారు. ఆటా అధ్యక్షురాలు బొమ్మినేని మధు, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో తొలి రోజు బ్యాంకెట్ సమావేశం జరిగింది.