Share News

Gulf Migrant Worker: తెలంగాణ గల్ఫ్ బాధితుడు రాథోడ్ లోకేషన్ గుర్తింపు!

ABN , Publish Date - Aug 09 , 2024 | 07:48 PM

గల్ఫ్ ఏడారిలో మగ్గిపోతున్నానని, తన ప్రాణాలను రక్షించాలంటూ నిన్న (గురువారం) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సెల్ఫ్ వీడియో ద్వారా వేడుకున్న నిర్మల్ జిల్లాకు చెందిన రాథోడ్ నామ్‌దేవ్ (గురువారం) జాడను గుర్తిస్తున్నట్టు తెలుస్తోంది.

Gulf Migrant Worker: తెలంగాణ గల్ఫ్ బాధితుడు రాథోడ్ లోకేషన్ గుర్తింపు!

గల్ఫ్ ఏడారిలో మగ్గిపోతున్నానని, తన ప్రాణాలను రక్షించాలంటూ నిన్న (గురువారం) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సెల్ఫ్ వీడియో ద్వారా వేడుకున్న నిర్మల్ జిల్లాకు చెందిన రాథోడ్ నామ్‌దేవ్ (గురువారం) జాడను గుర్తిస్తున్నట్టు తెలుస్తోంది. కువైట్‌ సరిహద్దులోని సౌదీ అరేబియా ఎడారిలో అతడు ఉన్నాడని సమాచారం తెలిసింది. ఇంట్లో పని ఉంటుందని చెప్పి ఏజెంట్లు అతడిని తీసుకెళ్లారు. కానీ ఒంటెల కాపరిగా పనిచేయించడంతో అతడు నరకయాతన అనుభవించాడు.


కాగా కువైట్‌లో ఒంటెల కాపరిగా పని చేయిస్తున్నారని రాథోడ్ నామ్‌దేవ్ వాపోయాడు. తనను కాపాడాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్‌లను వీడియోలో కోరాడు. ‘‘ నా బతుకు చూడండి సార్.. నన్ను కాపాడండి సార్.. నాది తెలంగాణ సారూ.. నన్ను చిత్రహింసలు పెడుతున్నారు సర్. తట్టుకోలేను. నేను బతకలేను సార్. సౌదీ ఏడారిలో ఉన్నాను సర్. సీఎం రేవంత్ రెడ్డి సార్ నన్ను కాపాడండి. మీకు రుణపడి ఉంటాను సర్. ఎండకు తట్టుకోలేకపోతున్నా సర్. జ్వరం తగిలి నాలుగు రోజులు అయ్యింది. కాపాడండి సర్.. లేకపోతే ఆత్మహత్య చేసుకొని సచ్చిపోతా. మీకు దండం పెడతా కాపాడండి సర్’’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రాథోడ్ స్వస్థలం ముధోల్‌ మండలం రువ్వి గ్రామం.

Updated Date - Aug 09 , 2024 | 07:48 PM