Home » NT Ramarao
పలు రాష్ర్టాల్లో అక్రమంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలను కూల్చేందు కు బీజేపీ కుట్ర చేస్తోందని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం భువనగిరిలో ని టీఆర్‌ఎస్ భవన్‌లో సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన మునుగోడు ఉప ఎన్నికలో ఓట్లు పోటెత్తాయి. 2018 ఎన్నికల్లో 91.31శాతం పోలింగ్ నమోదుకాగా, ఉప ఎన్నిక లో 93.13శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోల్చితే ఉప ఎన్నికలో 1.82శాతం అధికంగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా సంస్థాన్‌నారాయణపూర్ మండలంలో 93.76శాతం పోలింగ్ నమోదైంది. మండలంలో మొత్తం 36,430 ఓట్లు ఉండగా, 34,157 ఓట్లు పోలయ్యాయి.
రయ్.. రయ్‌మంటూ వచ్చిన ఖరీదైన కార్లు.. తెల్ల చొక్కాలు ధరించి వీధుల్లో హల్‌చల్ చేసిన నాయకులు.. జై జై అంటూ గల్లీల్లో తీసి న ర్యాలీలు.. మందు బాబులతో నిండిన మద్యం షాపులు.. ఎవరిని పలకరించినా గుప్పున కొట్టిన మందు వాసన.. మధ్యాహ్నం కాగా నే కిక్కిరిసిన హోటళ్లు.. చాయ్ దుకాణాల వద్ద గుమికూడిన జనం పిచ్చాపాటి.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో పెద్ద పెద్ద గిన్నెల్లో వండిన చికెన్, మటన్ రుచులు.. అమ్మా.. అయ్యా.. తమ్ముడు అంటూ పలకరిస్తూ పెట్టిన దండాలు.. ముట్టజెప్పిన డబ్బులు.. సమస్య చెప్పగానే ఇట్టే తీర్చిన నాయకగణం.. అవిచేస్తాం.. ఇవి చేస్తామంటూ కురిపించిన హామీలు.. రక్తం ఉప్పొంగించేలా పెద్ద నేతల ప్రసంగాలు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. పొట్టచేతబట్టుకొని వలస వెళ్లిన జీవులు సొంత ఊరికి వచ్చిన సంతోషం.. బంధు, మిత్రులతో కబుర్లు.. అంతటా పండుగ వాతావారణం.. ఉప ఎన్నిక తెచ్చిన కృత్రిమ పండు గ.. అనుకున్న రోజు రానే వచ్చింది.. ఎలక్షన్ల పండుగ చివరి రోజు పోలింగ్.. అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి ఇదే ఇచ్చారంటూ నిష్ఠూరాలు.. ఊరుగాని ఊరు నుంచి వస్తే ఇదేంటని నిలదీతలు.. ఇది మొన్నటి వరకు మునుగోడులో సీన్.. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఒక్కసారిగా ఆ సీన్ మారింది.
సంగారెడ్డి జిల్లాలో దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ శరత్ మండల తహసీల్దార్లను ఆదేశించారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని డీఈవో భిక్షపతి హెచ్చరించారు. మండలంలోని రాజన్నగూడెం ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులను చదివించి, వారి పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఉన్నత లక్ష్యంతో చదవాలన్నారు.
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలకు నలు మూలలనుంచి ప్రజలు తరలిరాగా మత్స్యగిరికొండపై భక్తుల కోలాహలంతో బ్రహ్మోత్సవ సందడి నెలకొంది. లోకకల్యాణం, విశ్వశాంతికోసం ముక్కోటి దేవతలకు నిలయంగా మత్య్సాద్రి ఆలయాన్ని అందంగా ముస్తాబుచేశారు.
ఈ నెల చివరిలోగా ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులను గుర్తించాలని కలెక్టర్ పమేలాసత్పథి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ ఏడీఏ, ఏవో, ఏఈవో, ఉద్యానశాఖ అధికారులు, ఎరువుల డీలర్లు, డ్రిప్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు ఈ నెల 3న పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికే చండూరులో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. పోలింగ్ గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. ప్రధాన పార్టీల నుంచి బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతిరెడ్డి మునుగోడు బరిలో నిలిచారు.
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ బెటాలియన్స్ డీఐజీ ఎంఎస్ సిద్ధిఖీ మంగళవారం డిచ్‌పల్లి ఏడో పోలీస్ బెటాలియన్ ను సందర్శించారు.
అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi) తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor).. ఇప్పుడు సౌత్ వైపు అడుగులేసేందుకు.. సిద్ధమవుతోందా? ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) సినిమాలో