విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-11-04T01:38:41+05:30 IST

విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని డీఈవో భిక్షపతి హెచ్చరించారు. మండలంలోని రాజన్నగూడెం ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులను చదివించి, వారి పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఉన్నత లక్ష్యంతో చదవాలన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్న డీఈవో

నిడమనూరు, నవంబరు 3: విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని డీఈవో భిక్షపతి హెచ్చరించారు. మండలంలోని రాజన్నగూడెం ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులను చదివించి, వారి పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఉన్నత లక్ష్యంతో చదవాలన్నారు. గణితంలో ప్రతీ విద్యార్థికి చతుర్విద ప్రక్రియలు వచ్చే విధంగా, తెలుగు, ఆంగ్లంలో చదివే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమమ్యే విధంగా బోధించాలన్నారు. అనంతరం నిడమనూరులోని ఆదర్శ పాఠశాల బాలికల వసతిగృహంలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాలల ఆవరణలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఆయనవెంట ఎంఈవో బాలు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ రంజిత, రాజన్నగూడెం హెచ్‌ఎం రవి ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-11-04T01:38:43+05:30 IST