Home » ODI World Cup
ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ జరుగుతోంది. కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఆ జట్టు బరిలోకి దిగింది. కేశవ్ మహరాజ్, షాంసీని జట్టులోకి తీసుకుంది. అయితే ఆస్ట్రేలియా ఒక స్పిన్నర్‌ను మాత్రమే ఎంచుకుంది.
Mohammed Shami Biography: మహ్మద్ షమీ. ప్రస్తుతం ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతుంది. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనే ఇందుకు కారణం. బంతి వేస్తే చాలు వికెట్ అన్నట్టుగా సాగుతుంది ఈ ప్రపంచకప్‌లో షమీ బౌలింగ్. ఒక బౌలర్ సాధారణ మ్యాచ్‌లో 5 వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తారు.
Mohammed Shami: మూడోసారి వన్డే ప్రపంచకప్‌ను గెలవాలనే కలను నెరవేర్చుకోవడానికి టీమిండియా ఇంకొక అడుగుదూరంలో ఉంది. ఫైనల్‌లోనూ గెలిస్తే 12 సంవత్సరాల తర్వాత విశ్వకప్ మన సొంతం అవుతుంది. దీంతో టీమిండియా ప్రపంచకప్ గెలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. కాగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను టీమిండియా చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే.
Shubman Gill Injury: న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో గిల్ గాయపడడం టీమిండియాను కాస్త కలవరపెట్టింది. కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హార్ట్‌గా మైదానాన్ని వీడాడు. అయితే చివరలో గిల్ మళ్లీ బ్యాటింగ్ రావడం, ఫీల్డింగ్ కూడా చేయడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం తన గాయంపై గిల్ మాట్లాడాడు.
PM Narendra modi: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీస్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన తుది పోరుకు అర్హత సాధించింది. నేక మంది ప్రముఖుల నుంచి టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సైతం సెమీ ఫైనల్‌లో భారత జట్టు ప్రదర్శనకు ఫిదా అయిపోయారు.
‘ఖలేజా’ సినిమాలో కష్టాల్లో ఉన్న ఒక ఊరి ప్రజల్ని కాపాడ్డానికి వచ్చిన మహేశ్ బాబుని ఏ విధంగా అయితే దేవుడిలా కొలుస్తారో.. అదే విధంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత పేసర్ ‘షమీ’శిఖరంగా అవతరించాడు. ఒకటి కాదు, రెండు కాదు..
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో 398 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వరల్డ్‌కప్ 2023 టోర్నీలో కెప్టెన్‌గా, ఆటగాడిగా ఘోరంగా విఫలం కావడంతో.. కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను కెప్టెన్‌గా రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు.
వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు చెలరేగాయి. న్యూజిలాండ్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. కింగ్ విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి భారత్ 397 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
భీకరమైన ఫామ్‌లో ఉన్న ‘పరుగుల యంత్రం’ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రపంచ కప్ 2023 తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై రికార్డ్ సెంచరీ నమోదు చేశాడు. వన్డే కెరీర్లో 50వ శతకాన్ని పూర్తి చేశాడు. 113 బంతుల్లో 117 పరుగులు కొట్టి ఔటయ్యాడు.