Home » ODI World Cup
రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదనే రికార్డ్స్ ఉంటాయి.. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సరిగ్గా సూటవుతుంది. ఎందుకంటే.. తన కెరీర్‌లో అతడు బద్దలుకొట్టని, సాధించని రికార్డ్ అంటూ ఏదీ లేదు.
ఓపెనర్ శుభ్‌మన్ అనూహ్యంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సెంచరీ దిశగా కొనసాగుతున్న తరుణంలో కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.
World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ సాధారణంగానే ఈ మ్యాచ్‌లోనూ తనదైన స్టైలులో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించాడు.
India vs New Zealand: వన్డే ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌లో కీలకమైన టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుంకా బరిలోకి దిగుతోంది.
IND vs NZ Semi-Final: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ చెలరేగుతున్నాడు. సూపర్ ఫామ్‌లో కింగ్ కోహ్లీ బఠాణీలు తిన్నంత సునాయసంగా పరుగులు చేస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు బాదేసిన కింగ్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఏకంగా 594 పరుగులు చేశాడు.
India vs New Zealand: దేశంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. అభిమానులంతా టీమిండియా నామజపంలో మునిగిపోయారు. బుధవారం జరిగే మొదటి సెమీస్ పోరులో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం అభిమానులు ప్రార్థనలు కూడా చేస్తున్నారు. పలువురు అభిమానులైతే ఆలయాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోల ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
India vs New zealand Semi-Final: భారత్, న్యూజిలాండ్ సెమీస్ సమరానికి అంతా సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో రెండు జట్ల మధ్య భీకరపోరు ప్రారంభంకానుది. గెలుపుపై టీమిండియా అభిమానులు ఎంత ధీమాగా ఉన్నప్పటికీ ఏదో భయం మనసును కలచివేస్తోంది. నాకౌట్ దశలో కివీస్ చేతిలో గతంలో ఎదురైన ఓటమినే ఈ ఆందోళనకు కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో లీగ్ దశలో అన్ని జట్లను చిత్తు చేసిన టీమిండియా నాకౌట్ పోరులో కివీస్ చేతిలో తుస్సుమంది.
India vs New Zealand: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ సెమీస్ సమరానికి సమయం ఆసన్నమైంది. బుధవారం జరిగే మొదటి సెమీస్‌లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి గత ప్రపంచకప్‌లో కివీస్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. ఫైనల్ చేరి ఈ సారైనా కప్ గెలవాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది.
అవును నాలుగేళ్ల క్రితం మనం కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు బదులు తీర్చుకునే సమయం వచ్చేసింది. న్యూజిలాండ్‌ను దెబ్బకు దెబ్బకు తీసి ప్రతీకారం తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. నాలుగేళ్ల కిందటి పీడ కలను చెరిపివేసి దాని స్థానంలో మరుపురాని విజయాన్ని పదిలంగా దాచుకోవడానికి సరైన సమయం ఇదే. 2019 జూలై 9. ఇప్పటికీ మన జట్టును పీడకలలా వెంటాడుతున్న తేదీ ఇది.
2007 నుంచి పలు ఐసీసీ టోర్నీలలో రోహిత్ టీమిండియా తరఫున ఆడాడు. అయితే నాకౌట్లలో రోహిత్ ప్రదర్శన చెత్తగా ఉంది. ఇప్పటి వరకు కేవలం అతడు రెండు సార్లు మాత్రమే 50 ప్లస్ స్కోరు చేశాడు. ఈ నేపథ్యంలో బుధవారం న్యూజిలాండ్‌తో జరగనున్న సెమీస్‌లో రోహిత్ ఎలా ఆడతాడో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.