Share News

IndiaVsNewzealand semi final: మ్యాచ్‌లో అనూహ్య పరిణామం.. శుభమన్ గిల్ రిటైర్డ్ హర్ట్...

ABN , First Publish Date - 2023-11-15T16:05:40+05:30 IST

ఓపెనర్ శుభ్‌మన్ అనూహ్యంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సెంచరీ దిశగా కొనసాగుతున్న తరుణంలో కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.

IndiaVsNewzealand semi final: మ్యాచ్‌లో అనూహ్య పరిణామం.. శుభమన్ గిల్ రిటైర్డ్ హర్ట్...

ముంబై: ఓపెనర్ శుభ్‌మన్ అనూహ్యంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సెంచరీ దిశగా కొనసాగుతున్న తరుణంలో కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. నొప్పిని తాళలేక గిల్ మైదానంలోనే పడిపోయాడు. హుటాహుటిన వచ్చి ఫిజియోలు పరిశీలించారు. అనంతరం గిల్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కి వెళ్లాడు. వ్యక్తిగత స్కోరు 79(నాటౌట్) పరుగుల వద్ద అనూహ్యంగా ఈ పరిణామం జరిగింది. గిల్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ (47 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (4) క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లు పూర్తయ్యే సరికి 1 వికెట్ నష్టానికి భారత స్కోరు 181 పరుగులుగా ఉంది.

Updated Date - 2023-11-15T16:14:45+05:30 IST