Home » Patna
కూరగాయలు అమ్ముకొనే మహిళ నుంచి 34 ఏళ్ల క్రితం రూ.20 లంచం తీసుకున్న మాజీ పోలీసు కానిస్టేబుల్ను అరెస్టు చేయాలని బిహార్లోని స్పెషల్ విజిలెన్స్ కోర్టు గురువారం డీజీపీని ఆదేశించింది.
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తిరిగి ఎన్నికయ్యారు. దీంతో వచ్చే ఐదేళ్లు ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. రాంచీలో జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చిరాగ్ పాశ్వాన్ తిరిగి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎల్జేపీ (ఆర్వీ) ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.
రేడియోధార్మిక పదార్థమైన కాలిఫోర్నియం రాయిని స్మగ్లింగ్ చేస్తుండగా బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 50గ్రాముల రాయి విలువ రూ.850 కోట్లు పలుకుతుందని అంచనా.
బిహార్లో 24గంటల వ్యవధిలో చోటుచేసుకున్న వేర్వేరు పిడుగుపాటు ఘటనల్లో 25మంది మరణించారు. 39 గాయపడ్డారు. ఈ కారణంగా కిషన్గంజ్, అరారియా జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.
నితీశ్కుమార్ రాజకీయ వారసుడు ఎవరంటూ జరుగుతున్న చర్చకు దాదాపుగా తెర పడినట్టే! ఆయన సలహాదారు, మాజీ ఐఏఎస్ మనీశ్ వర్మ అధికారికంగా జేడీయూలో చేరారు.
నితీశ్ కుమార్.. మోదీ ముందు భారీ డిమాండ్ ఉంచారు. అదే ప్రత్యేక హోదా. ఏపీలాగే ఎన్నో ఏళ్ల నుంచి బిహార్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడుగుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా ఉన్నామని భావిస్తున్న జేడీయూ ఇదే అదనుగా భావిస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తోంది.
జనతాదళ్ (యునైటెడ్) - జేడీయూ(JDU) పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం సంజయ్ ఝాను శనివారం నియమించింది. ముఖ్యమంత్రి నితీష్కుమార్ అధ్యక్షతన జరిగిన కోర్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నీట్ అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన సీబీఐ జోరు పెంచింది. బిహార్, గుజరాత్ రాష్ట్రాల్లో నీట్ అవకతవకలకు సంబంధించి నమోదైన ఒక్కో కేసును రీ-రిజిస్టర్ చేసింది.
నీట్ పేపర్ లీక్ అయ్యింది! ‘‘అబ్బే.. నీట్లో ఎలాంటి అక్రమాలూ జరగలేదు, పేపర్ లీక్ అయ్యిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు’’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతగా దాచే ప్రయత్నం చేస్తున్నా నిజాలు దాగట్లేదు.
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఇటీవల నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది.