Share News

Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ ఆదేశంతో డాన్స్ చేసిన పోలీసుపై చర్యలు

ABN , Publish Date - Mar 16 , 2025 | 04:34 PM

తేజ్ ప్రతాప్ తన నివాసంలో శనివారంనాడు హోలీ వేడుకలు నిర్వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. వేదికపై కూర్చున్న తేజ్ ప్రతాప్ మైక్ పట్టుకుని కానిస్టేబుల్ దీపక్‌కుమార్‌ను డాన్స్ చేయాల్సిందిగా ఆదేశించారు.

Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ ఆదేశంతో డాన్స్ చేసిన పోలీసుపై చర్యలు

పాట్నా: ఆర్జేడీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్‌‌ (Tej Pratap)కు సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్న కానిస్టేబుల్‌ దీపక్‌కుమార్‌పై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. అతనిని సెక్యూరిటీ బాధ్యతల నుంచి తప్పించి పోలీస్ లైన్స్‌కు అటాచ్ చేసింది. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పోలీసు యూనిఫాంలో ఉంటూ డాన్స్ చేసినందుకు ఆయనను పోలీస్ లైన్స్‌కు పంపామని, కుమార్ స్థానంలో ఎమ్మెల్యే సెక్యూరిటీకి మరొకరిని నియమిస్తారని ఆ ప్రకటన పేర్కొంది.

Tej Pratap: డాన్స్ చేస్తావా? సస్పెండ్ చేయనా?.. పోలీసుకు తేజ్ ప్రతాప్ హుకుం


తేజ్ ప్రతాప్ హుకుం

తేజ్ ప్రతాప్ తన నివాసంలో శనివారంనాడు హోలీ వేడుకలు నిర్వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. వేదికపై కూర్చున్న తేజ్ ప్రతాప్ మైక్ పట్టుకుని కానిస్టేబుల్ దీపక్‌కుమార్‌ను డాన్స్ చేయాల్సిందిగా ఆదేశించారు. లేదంటే సస్పెండ్ అవుతావంటూ బెదిరించారు. దీంతో కొద్ది క్షణాలు కానిస్టేబుల్ తన కుడి చేతిని గాలిలో ఆడిస్తూ డాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆయనను సెక్యూరిటీ భాద్యతల నుంచి శాఖ తప్పిస్తూ పోలీసు శాఖ తాజా ఆదేశాలిచ్చింది.


స్కూటర్ యజమానికి ఫైన్

హోలీ వేడుకల్లో భాగంగా తేజ్ ప్రతాప్ తమ సమీప ప్రాంతాల్లో స్కూటరుపై తిరిగారు. దీంతో స్కూటర్ యజమానిపై పోలీసులు చర్యలకు దిగారు.హెల్మెట్ లేకుండా స్కూటర్ డ్రైవ్ చేయడం, పొల్యూషన్ సర్టిఫికెట్, బీమా లేకపోవడంతో రూ.4,000 చలానా విధించినట్టు పాట్నా ఎస్పీ (ట్రాఫిక్) అపరాజిత్ లోహన్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2025 | 04:35 PM