Home » Patna
బీహార్‌లోని పాట్నా కోర్టు ఆవరణ లో శుక్రవారంనాడు దారుణం చోటుచేసుకుంది. విచారణ ఖైదీని కోర్టుకు హాజరుపరుస్తుండగా అతన్ని ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. పోలీసుల కళ్లముందే ఈ దారుణం జరగడంతో ఉద్రిత్త పరిస్థితి తలెత్తింది. దుండగులు ఇద్దరినీ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఏడేళ్ల క్రితం అమలు చేసిన మద్యపాన నిషేధం(Liquor Ban)పై అధ్యయనం చేయాలని బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పంచ్ డైలాగ్‌లు విసరి నవ్వులు పూయించడంలో ఆర్జేడీ సుప్రీం, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మంచి పేరుంది. ఆసక్తికరంగా ఈసారి ఆయన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌పై పంచ్ విసిరారు. ''నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా?'' అంటూ కేంద్ర మంత్రిపై సెటైర్ వేశారు.
బిహార్(Bihar) ప్రభుత్వ విజయాలను పార్టీలు వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవద్దని సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) కోరారు. బిహార్ స్టేట్ పవర్ (హోల్డింగ్) కంపెనీ లిమిటెడ్ 11వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం రూ.14 వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులను ఆవిష్కరించిన ఆయన ఏడు పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో రాజకీయ ప్రకంపనలకు కారణం కానున్న బిహార్‌లోని కులగణన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ లెక్కల ఆధారంగా రాజకీయ కార్యాచరణకు బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సిద్ధమవుతున్నారు..
బిహార్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినా అదనపు వడ్డీ ఇవ్వలేదని..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరనున్నారా?. దీనిపై కొద్దిరోజులుగా నడుస్తున్న ఊహాగానాలకు ఊతం ఇస్తూ ఆయన పాట్నాలో సోమవారంనాడు జరిగిన జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని తాను చెప్పినదే నిజమవుతోందని, అందుకు అనుగుణంగానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు మోదీ ప్రభుత్వం పిలుపునిచ్చిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ముంబైలో రెండ్రోజుల 'ఇండియా' కూటమి సమావేశాలు ముగించుకుని పాట్నాకు వచ్చిన నితీష్ మీడియాతో మాట్లాడారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని, విపక్ష కూటమి ఇండియా గెలుపు ఖాయమని రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు.
విపక్షాల ఐక్య కూటమి ప్రయత్నాల కోసం బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశం ఫలప్రదమైందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని తామంతా నిర్ణయించామని బీహార్ ముఖ్యమంత్రి, ఐక్య కూటమి ఏర్పాటుకు సంధానకర్తగా వ్యవహరిస్తున్న జేడీయూ నేత నితీష్ కుమార్ తెలిపారు.