Home » Patnam Mahender Reddy
అవును.. ఇన్నాళ్లుగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్‌గా (Governor Vs Govt) ఉన్న పరిస్థితులన్నీ ఒకే ఒక్క భేటీతో మారిపోయాయ్.! ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే గవర్నర్ తమిళిసైతో (Governor Tamilisai) సీఎం కేసీఆర్ (CM KCR) రాజీ అయ్యారనే చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..!..
తెలంగాణ కేబినెట్ విస్తరణ గురువారం జరిగింది. రాష్ట్ర మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి (Patnam Mahender Reddy) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్ (Raj Bhavan)లో గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) మహేందర్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి మరోసారి కేసీఆర్ కేబినెట్‌లోకి అవకాశం దక్కింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాండూరు నుంచి పోటీ విషయంలో వెనక్కి తగ్గినందుకు ప్రతిఫలంగా పట్నంకు మంత్రి పదవి దక్కింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ రాజకీయాలు (TS Politics) జోరందుకున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ను ఈసారి గద్దె దించాల్సిందేనని ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ (BJP, Congress) పార్టీలు.. గులాబీ బాస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నారు..