BRS Vs Congress : కేసీఆర్‌కు ఊహించని ఝలక్.. ‘కారు’ దిగడానికి సిద్ధమైన బిగ్ బ్రదర్స్.. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే..!?

ABN , First Publish Date - 2023-07-07T18:35:07+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ రాజకీయాలు (TS Politics) జోరందుకున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ను ఈసారి గద్దె దించాల్సిందేనని ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ (BJP, Congress) పార్టీలు.. గులాబీ బాస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నారు..

BRS Vs Congress : కేసీఆర్‌కు ఊహించని ఝలక్.. ‘కారు’ దిగడానికి సిద్ధమైన బిగ్ బ్రదర్స్.. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే..!?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ రాజకీయాలు (TS Politics) జోరందుకున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ను ఈసారి గద్దె దించాల్సిందేనని ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ (BJP, Congress) పార్టీలు.. గులాబీ బాస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మార్చడానికి కూడా కేసీఆర్ వెనుకాడట్లేదట. ఇందులో భాగంగానే జూలై-15న 80 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన తొలి జాబితా రిలీజ్ చేయబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి విశ్వసనీయ వర్గాల సమాచారం. సరిగ్గా ఇదే సమయంలో బీఆర్ఎస్ (BRS) టికెట్ దక్కదని.. సర్వేల్లో అనుకూలంగా లేని సిట్టింగ్‌లు, మాజీలు.. టికెట్ ఆశించిన ఎమ్మెల్సీలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బీఆర్ఎస్‌లోకి.. ‘కారు’ దిగి హస్తం పార్టీ కండువాలు కప్పేసుకున్నారు. తాజాగా.. తెలంగాణలో సీనియార్టీ, బీఆర్ఎస్ ముఖ్య నేతగా ఉన్న బిగ్ బ్రదర్స్ (Big Brothers).. బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పబోతున్నారన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే ఆ ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ కావడం గమనార్హం. ఇంతకీ ఆ బిగ్ బ్రదర్ ఎవరు..? ఆయన కండువా కప్పుకోవడానికి రెడీ అవ్వగా.. సోదరుడు డైలామాలో పడ్డారా..? ఇందులో ఉన్న బిగ్ ట్విస్ట్ ఏమిటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

BRS-Vs-Congress.jpg

ఇదీ అసలు కథ..!

ఆ బిగ్ బ్రదర్స్ మరెవరో కాదండోయ్.. పట్నం బ్రదర్సే.. (Patnam Brothers) పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy), పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy)..! పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సుపరిచితమే. ఇప్పటి వరకూ మూడు సార్లు టీడీపీ తరఫున, ఒకసారి బీఆర్ఎస్ తరఫున తాండూరు నుంచి పోటీచేసి సత్తా చాటుకున్నారు. అంతేకాదు.. 2014 ఎన్నికల్లో గెలిచాక పట్నంను రవాణా శాఖ మంత్రి పదవి కూడా వరించింది. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ఫైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy) 2,875 ఓట్ల తేడాతో పట్నంపై గెలిచారు. సీనియార్టీ ఉన్న నేత కావడంతో మహేందర్ సేవలను గుర్తించిన అధిష్టానం.. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అయితే ఫైలట్ కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో నాటి నుంచి పార్టీలో పట్నంకు ప్రాధాన్యత తగ్గింది. దీంతో పట్నం ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. ఇద్దరి మధ్య సవాళ్లు కూడా జరిగిన పరిస్థితి.. అంతకుమించి బలనిరూపణ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయ్. ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమానికి హాజరుకావాలన్నా.. అటు ఫైలట్, ఇటు పట్నం హాజరుకావాల్సి వస్తోంది. ఎక్కడో ఒకచోట పొరపచ్చాలు వచ్చి అవికాస్త ఇరు వర్గీయుల మధ్య గొడవల దాకా కూడా వెళ్లాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే రానున్న ఎన్నికల్లో పట్నంను కాదని.. ఫైలట్‌కే తాండూరు ఎమ్మెల్యే టికెట్ (Tandur MLA Ticket) ఇస్తారన్న వార్త అభిమానులు, ఆ కుటుంబానికి రుచించలేదు. దీంతో ఇక బీఆర్ఎస్‌లో ఉండాల్సిన అక్కర్లేదని.. కచ్చితంగా పార్టీ మారి ఎలాగైనా సరే ఇదే తాండూరు గడ్డ మీద గెలిచి నిలవాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. ఇదంతా అభిమానులు, కార్యకర్తలు, నేతలతో రహస్య సమావేశం తర్వాత జరిగిందని టాక్ నడుస్తోంది. వాస్తవానికి జూన్-22న బీఆర్ఎస్‌కు బై బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల అది వాయిదా పడిందట. సరిగ్గా ఈ క్రమంలోనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ కాల్ రావడంతో సీఎం కేసీఆర్‌ను కలిసొచ్చారు. అయితే.. టికెట్‌పై ఎలాంటి హామీ రాకపోవడంతో సీన్ మళ్లీ మొదటికే వచ్చిదంట. జూలై-15న 80 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలిజాబితాను కేసీఆర్ రిలీజ్ చేయబోతున్నారట. ఒకవేళ ఈ లిస్టులో పేరు లేకుంటే మాత్రం పట్నం ఫ్యామిలీ బీఆర్ఎస్‌కు బై బై చెప్పేస్తారట.

Pilot-Rohit-Reddy.jpg

కాంగ్రెస్‌లోకి వెళ్తే పరిస్థితేంటి..!?

పట్నం మహేందర్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఇద్దరూ మంచి స్నేహితులే. ఎందుకంటే ఈ ఇద్దరూ కూడా టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వారే. నాటి నుంచి నేటి వరకూ అదే సాన్నిహిత్యం ఇద్దరి మధ్యా ఉంది. అందుకే తన ఆప్తుడు రేవంత్‌తో మహేందర్ టచ్‌లోకి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇన్ని రోజులుగా పట్నం మహేందర్ ఒక్కరే బీఆర్ఎస్ గుడ్ బై చెబుతారని వార్తలు వచ్చినా తన సోదరుడ్ని కూడా బయటికి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే.. మహేందర్ వెళ్లిన తర్వాత కచ్చితంగా నరేందర్ రెడ్డికి పొమ్మన లేక పొగబెడతారన్నది జగమెరిగిన సత్యమే. అందుకే అవన్నీ కాకుండా తాను ఎప్పుడు ‘కారు’ దిగుతానో తన వెంటే తమ్ముడిని కూడా తెచ్చుకోవాలన్నది మహేందర్ ఆలోచనట. అయితే ఇలా చర్చలు, వార్తలు వస్తుండటంతో ఏం చేయాలి.. అన్న వెంట నడవాలా..? లేకుంటే కేసీఆర్‌తోనే ఉండాలా..? అన్నది తేల్చుకోలేక డైలమాలో పడ్డారట నరేందర్ రెడ్డి.

Patnam-02.jpg

ఇదే పెద్ద ట్విస్ట్.. తలనొప్పి కూడా..!?

వాస్తవానికి ఇన్నిరోజులు పట్నం మహేందర్ రెడ్డి మాత్రమే పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేరు కూడా రావడం గమనార్హం.. ఇదే ఇక్కడ బిగ్ ట్విస్ట్. అయితే గత నెలరోజులుగా ఎక్కడా చూసినా ఈ వ్యవహారం చర్చనీయాంశం అయినా.. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నప్పటికీ ఈ బిగ్ బ్రదర్స్ ఇద్దరిలో ఒక్కరంటే ఒక్కరూ స్పందించలేదు. అయితే మౌనానికి అంగీకారమే అర్థమని అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ పార్టీకి గుడ్ బై చెబుతున్నారంటే కేసీఆర్‌కు బిగ్ షాకేనని చెప్పుకోవచ్చు. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. తాండూరు నియోజకవర్గానికి ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీచేసేంత నేత లేరు కాబట్టి పట్నం మహేందర్ రెడ్డికి ఇవ్వొచ్చు.. మరి నరేందర్ రెడ్డి సంగతేంటి..? గత ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిపై గెలిచింది ఇతనే. రానున్న ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీచేయాలని రేవంత్ భావిస్తున్నారు కూడా. అంతేకాదు.. సీనియర్ నేత, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గురునాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు నరేందర్ పార్టీలోకి వస్తే ఆయన్ను ఎక్కడ్నుంచి పోటీచేయించాలన్నది రేవంత్‌కు బిగ్ టాస్కే..! ఇవన్నీ ఒక ఎత్తయితే.. మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డి (Patnam Sunitha Reddy) ఇప్పుడు రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌గా సునితా మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈమెను కూడా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయించాలని మహేందర్ భావిస్తున్నారట. అంటే పట్నం ఫ్యామిలీ నుంచి ముగ్గురికి టికెట్లు ఇవ్వాలన్న మాట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మహేశ్వరం (Maheswaram) , తాండూరుతో పాటు మరో కీలక నియోజకవర్గాన్ని అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మహేందర్ రెడ్డి తాండూరు ఇచ్చినా మిగిలిన వారిని సద్దుబాటు చేయడానికి వీలయ్యే పరిస్థితులు కనిపించట్లేదట. ఎందుకంటే.. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy) కూడా కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. కచ్చితంగా అక్కడ్నుంచి తీగలకే ఛాన్స్ ఉంటుంది.

Patnam-Brothers.jpg

మొత్తానికి చూస్తే.. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో సీన్ మారిపోయింది. ఎక్కడో మూడోస్థానంలో కాంగ్రెస్ ఇప్పుడు రెండోస్థానానికి ఎగబాకింది. బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌కు రావడంతో పార్టీ మారాలనే నేతలకు ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్సే. ఇప్పటికే బీజేపీ నుంచి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమవుతుండగా ఇప్పుడు అధికార పార్టీ నుంచి అందులోనూ ఒక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అంటే ఆషామాషీ విషయమేమీ కాదు.. ఇదేగానీ జరిగితే కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌కు కొండంత బలమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతజరుగుతుంటే కేసీఆర్ కూడా సైలెంట్‌గా ఉండరు.. తన రాజకీయ చాణక్యతతో ఎలాంటి వ్యూహాలు రచిస్తారో.. కాంగ్రెస్ ఎలాంటి ప్రతి వ్యూహాలు పన్నుతుందో వేచి చూడాలి మరి.

2revanth.jpg


ఇవి కూడా చదవండి


TS Politics : బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఊహించని షాక్.. త్వరలో కాంగ్రెస్‌లోకి ముగ్గురు బిగ్ షాట్‌‌లు..!


Ponguleti Meets YS Jagan : తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిన తెలంగాణ రాజకీయాలు.. సీఎం జగన్‌తో పొంగులేటి భేటీ.. షర్మిల గురించే చర్చ..!


Kishan Reddy : ‘బండి’ని తప్పించి మరీ కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం వెనుక ఇంత కథుందా.. అది కూడా రెండోసారి..!?


TeluguDesam : ఎన్డీఏ మీటింగ్‌కు టీడీపీ.. తర్వాత జరగబోయేది ఇదేనా..?


Telangana BJP : ‘బండి’ని తప్పించాక యమా స్పీడ్‌ మీదున్న ఈటల.. ఈ అస్త్రాలన్నీ ప్రయోగించబోతున్నారా..!?



Updated Date - 2023-07-09T16:41:28+05:30 IST