Home » Peddi Reddi Ramachandra Reddy
Andhrapradesh: అనంతపురంలో జరుగనున్న ‘‘సిద్దం’’ సభ ఏర్పాట్లపై వైసీపీ సన్నాహక సమావేశం నిర్వహించింది. సోమవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కోఆర్డీనేటర్లు హాజరయ్యారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడి చేస్తామంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పాపాల పెద్దిరెడ్డి అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడితే పెద్దిరెడ్డికి అంత కోపం వస్తోందన్నారు.
ఎమ్మెల్యే ఆదిమూలం మాటలు ఆయన విజ్ఞతికే వదిలేస్తున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాము కష్టపడి ఆదిమూలంని గెలిపించామని పేర్కొన్నారు. తిరుపతి ఎంపీగా కొత్త అభ్యర్ధులు అన్వేషణ జరుగుతోందన్నారు.
Roja Contest As MP..? ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP 2024 Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ (YSR Congress) నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..! ఎప్పుడేం ప్రకటన వస్తుందో.. ఎక్కడ తమ సీటుకు ఎసరుపడుతుందో అని సిట్టింగులు టెన్షన్ టెన్షన్‌తోనే గడిపేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను వదలని సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. ఇప్పుడు మంత్రులకు కూడా స్థానచలనం చేస్తున్నారు. అది కూడా ఏ మాత్రం పరిచయం, సంబంధమే లేని జిల్లాలకు మారుస్తుండటంతో అవాక్కవుతున్న పరిస్థితి..
Andhrapradesh: హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఎఫెక్ట్ గార్మెంట్స్ పరిశ్రమలపై పడింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని పరిశ్రమలకు సెలవు ప్రకటించి కార్మికులను సమావేశాలకు తరలించాలంటూ వైసీపీ నేతలు సూచించారు.
సూపర్ సిక్స్ పథకం అమలు చేసి అందరికీ న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) తెలిపారు. శనివారం నాడు కుప్పం మండలం మల్లానూరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ...‘‘వంద రోజుల్లో కుప్పంలో 8వ సారి ఎన్నుకోబోతున్నారు. మూడు రోజుల పర్యటన చూస్తుంటే లక్ష ఓట్లు మెజార్టీ సాధ్యమేనని తెలుస్తోంది. ఈ ఐదేళ్లలో ప్రజల జీవితాల్లో చీకటిని వైసీపీ నింపింది’’ అని చంద్రబాబు తెలిపారు.
నాపరాయి మైనింగ్ పరిశ్రమల పరిస్థితులపై గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra Reddy ), ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ( Buggana Rajendranath Reddy ) సంయుక్తంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, రాయలసీమ జిల్లాల వైసీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యర్తలపై పుంగనూరులో పెద్దిరెడ్డి అనుచరుల దాడిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలుగుదేశం, జనసేన (Telugu Desam, Janasena) పొత్తు ప్రభావం ఏపీ రాజకీయాల(AP politics)పై ఏ విధమైన ప్రభావం ఉండబోదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy) వ్యాఖ్యానించారు.